[racchabanda] షట్పదేరితము, చంపకమాల, అష్టపది #haTpadEritamu, chaMpakamAla, ashTapadi#

 

షట్పదేరితము, చంపకమాల, అష్టపది - 

ప్రతి పాదములో ఈ వృత్తమునకు రెండు చతుర్మాత్రలు కాని మూడు అష్టమాత్రలు ఉన్నాయి. ఈ ఛందస్సు వాగ్వల్లభలో పేర్కొనబడినది. ఒకప్పుడు ఈ వృత్తమును తుమ్మెద పేరుతో ఉండే వృత్తముల సంకలనములో పేర్కొని ఉదాహరణముగా నిచ్చినాను. ఆ వ్యాసము "మాలిక" పత్రికలో ప్రచురించబడినది. క్రింద నా ఉదాహరణములు - 

షట్పదేరితము - న/ర/న/ర/న/ర IIIUIU - IIIUIU - IIIUIU
18 ధృతి 95704

కమలనేత్ర నీ - కనులఁ జూడ నా - కడలి పొంగెరా 
విమలమైన యా - వెలుఁగుఁ జూపరా - ప్రియతమా సదా  
సుమము లెన్నొ బల్ - సొగసు నిండఁగా - సుగము నిచ్చె నా 
యమిత వాంఛలన్ - హరుసమొందఁగా - నమల దీర్చరా 

ప్రాసయతితో - 

తెలుఁగు మాటలన్ - దెలుఁగు పాటలే - జెలఁగు శోభలన్ 
దెలుఁగు తోటలోఁ - దెలుఁగు కోకిలల్ - పలుకు రావముల్ 
తెలుఁగు ముద్రతోఁ - దెలుఁగు నృత్యముల్ - వెలుఁగు నందమై 
కలల పండువై - కలికి రాదరిన్ - నిలువఁ దోడుగా 

లలిత భావమై - లలిత రాగమై - లలిత గీతమై 
కలల నీడగా - లలన బాడఁగా - నలలు లేచెఁగా 
నలల హోరులో - జలము  చిందగా - వెలుఁగు కాంతిలోఁ  
గలుగు భ్రాంతిలో - నలరు మోదమా - తెలుఁగు నాదమా 
(మాలిక పత్రికలోనిది) 

ఈ వృత్తమునకు ముందు ఒక న-లమును ఉంచి చంపకమాలవలె వ్రాద్దామా? 

న/న/జ/భ/జ/భ/జ/గ IIII IIIUIU - IIIUIU IIIUIU
22 ఆకృతి 1531264 

వదనము గనఁగ నెంచఁగా - వరదుఁ డెందుకో కినుక నుండెనే 
ముదమున నెచట నుండెనో - పులక లీయఁగాఁ బలుకఁ డేలకో 
నిధియని తలఁచి యుండఁగా - నెనరు చూపఁడే విరహవేళలో 
హృదయము వ్యధల వాడఁగాఁ - బ్రియ వసంతమం దరుస ముండునా 

షట్పదేరితము చివర ఒక స-గణమును ఉంచి అష్టపదిలా వ్రాసిన ఒక పద్యము - 

న/ర/న/ర/న/ర/స IIIUIU - IIIUIU - IIIUIU IIU
21 ప్రకృతి 882136 

ఇది మనోహరం - బిది ముదాకరం - బిది మధూదయం బతివా
సుధలఁ జిందు నీ - వదనచంద్రమం - దదరు లేలకో చెలియా 
కదలఁ జెప్పనా - పదముఁ బాడనా - పెదవిఁ దాఁకనా సకియా 
మదిని దోఁచకే - నిధిని దాఁచకే - హృదిని దాఁకవే త్వరగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
shaTpadEritamu, chaMpakamAla, ashTapadi - 

prati pAdamulO ee vRttamunaku reMDu chaturmAtralu kAni mUDu ashTamAtralu unnAyi. ee ChaMdassu vAgvallabhalO pErkonabaDinadi. okappuDu ee vRttamunu tummeda pErutO uMDE vRttamula saMkalanamulO pErkoni udAharaNamugA nichchinAnu. aa vyAsamu "mAlika" patrikalO prachuriMchabaDinadi. kriMda nA udAharaNamulu - 

shaTpadEritamu - na/ra/na/ra/na/ra #IIIUIU - IIIUIU - IIIUIU#
18 dhRti 95704

kamalanEtra nI - kanula@M jUDa nA - kaDali poMgerA 
vimalamaina yA - velu@Mgu@M jUparA - priyatamA sadA  
sumamu lenno bal - sogasu niMDa@MgA - sugamu nichche nA 
yamita vAMChalan - harusamoMda@MgA - namala dIrcharA 

prAsayatitO - 

telu@Mgu mATalan - delu@Mgu pATalE - jela@Mgu SObhalan 
delu@Mgu tOTalO@M - delu@Mgu kOkilal - paluku rAvamul 
telu@Mgu mudratO@M - delu@Mgu nRtyamul - velu@Mgu naMdamai 
kalala paMDuvai - kaliki rAdarin - niluva@M dODugA 

lalita bhaavamai - lalita raagamai - lalita geetamai 
kalala neeDagaa - lalana baaDa@Mgaa - nalalu laeche@Mgaa 
nalala hOrulO - jalamu  chiMdagaa - velu@Mgu kaaMtilO@M  
galugu bhraaMtilO - nalaru mOdamaa - telu@Mgu naadamaa 
(mAlika patrikalOnidi) 

ee vRttamunaku muMdu oka na-lamunu uMchi chaMpakamAlavale vrAddAmA? 

na/na/ja/bha/ja/bha/ja/ga #IIII IIIUIU - IIIUIU IIIUIU#
22 aakRti 1531264 

vadanamu gana@Mga neMcha@MgA - varadu@M DeMdukO kinuka nuMDenE 
mudamuna nechaTa nuMDenO - pulaka lIya@MgA@M baluka@M DElakO 
nidhiyani tala@Mchi yuMDa@MgA - nenaru chUpa@MDE virahavELalO 
hRdayamu vyadhala vADa@MgA@M - briya vasaMtamaM darusa muMDunA 

shaTpadEritamu chivara oka sa-gaNamunu uMchi ashTapadilA vrAsina oka padyamu - 

na/ra/na/ra/na/ra/sa #IIIUIU - IIIUIU - IIIUIU IIU#
21 prakRti 882136 

idi manOharaM - bidi mudAkaraM - bidi madhUdayaM bativA
sudhala@M jiMdu nI - vadanachaMdramaM - dadaru lElakO cheliyA 
kadala@M jeppanA - padamu@M bADanA - pedavi@M dA@MkanA sakiyA 
madini dO@MchakE - nidhini dA@MchakE - hRdini dA@MkavE tvaragA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: