[racchabanda] మంజరీ #maMjarI#

 

మంజరీ - 

మాత్రా గణ నిర్మితము, హేమచంద్రుని ఛందోనుశాసనము నుండి. ప్రాకృతములో - యతి ప్రాసలు లేవు, అంత్యప్రాస మాత్రమే, పాదము సామాన్యముగ గుర్వంతము. 

మంజరీ - త్రి/త్రి/చ - చ/చ/త్రి 

సంజలోని కెంపులు - చానకుఁ జెక్కిలి కింపు 
మంజులమ్ము గాలులు - మానిని కిచ్చును దెంపు 
మంజరులఁ గనంగను - మధురోపవనము నిండ 
కుంజమందుఁ బూవులు - కోమలి గళమున దండ 

చందమామ చెలువము - సకియ మొగమ్మున తళుకు 
మందమైన నగవులు - మగువ పెదవులకు బెళుకు 
సుందరతర సుమములు - సుదతికి జడలో మాల 
నందగోకులములో - నాతికి విరహపు జ్వాల 

నీవు నేను గలియఁగ - స్నేహసరసిజము విరియు 
నీవు నేను వేఱవ - నేత్రము లశ్రులఁ గురియు 
నీవు లేక నేనొక - నేలను రాలిన తార 
నీవు నేను జేరఁగ - నింగియె మనకగు మేఱ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
maMjarI - 

mAtrA gaNa nirmitamu, hEmachaMdruni ChaMdOnuSAsanamu nuMDi. prAkRtamulO - yati prAsalu lEvu, aMtyaprAsa mAtramE, pAdamu sAmAnyamuga gurvaMtamu. 

maMjarI - tri/tri/cha - cha/cha/tri 

saMjalOni keMpulu - chAnaku@M jekkili kiMpu 
maMjulammu gAlulu - mAnini kichchunu deMpu 
maMjarula@M ganaMganu - madhurOpavanamu niMDa 
kuMjamaMdu@M bUvulu - kOmali gaLamuna daMDa 

chaMdamAma cheluvamu - sakiya mogammuna taLuku 
maMdamaina nagavulu - maguva pedavulaku beLuku 
suMdaratara sumamulu - sudatiki jaDalO mAla 
naMdagOkulamulO - nAtiki virahapu jvAla 

nIvu nEnu galiya@Mga - snEhasarasijamu viriyu 
nIvu nEnu vE~rava - nEtramu laSrula@M guriyu 
nIvu lEka nEnoka - nElanu rAlina tAra 
nIvu nEnu jEra@Mga - niMgiye manakagu mE~ra 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAVu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: