[racchabanda] మనోహర #manOhara#

 

మనోహర - 

ఆధారము - కల్పితము
నడక - చంపకమాల, చంపకమాలయందలి 8,9 అక్షరములైన లఘువులను గురువుగా చేసినప్పుడు లభించిన వృత్తము.

మనోహర - న/జ/త/భ/భ/ర/లగ 
20 కృతి 355632 

చంపకమాల లయతో - IIII UIU UI - UII UII UIUIU

సుమధుర రాత్రిలో నీవు - సుందర హాసముతోడ నిల్వఁగాఁ 
గమలము పూచినట్లుండెఁ - గైరవలోచని చంద్రకాంతిలో 
విమలము ప్రేమ భావమ్ము - విశ్వమనోహర రాగ రంజితం 
బమలము మానసమ్మిందు - నంబరసీమలఁ దాఁకుచుండెనే 

కనులను వ్రాతువా గీతి - కమ్మని తేట తెనుంగులోన నా 
కనిశము నీవె యందమ్ము - హర్షసుధాంశవిభాతరంగముల్ 
కనఁగను రమ్ము రంజిల్లఁ - గామితముల్ రసపూర్ణ యామినిన్ 
దను విట వేచెఁ నీకై ని-తాంత నిరీక్షణతో విలాసినీ 

సంపఁగి లయతో - IIII UIU UIU - IIU IIUI UIU

హిమమును గొండపైఁ జూడఁగా - నెదలోఁ బ్రతిరోజు శోకమే 
సుమములు నేలపై రాలఁగా - సుగమే కనరాదు తీవకున్ 
మమతల పుష్పముల్ వాడఁగా - మనమం దొక గ్రీష్మ కాలమే 
భ్రమముల మధ్యలో నిద్రయా - రమణీ విరహంపు రుగ్మమే 

నిలయము నీవెగా విద్యకున్ - నిధిగా మదిలోనఁ దల్తు నిన్ 
వలయము నీవెగా వాణికిన్ - వరదా వరమిమ్ము చల్లఁగా 
తెలుఁగున గైతలన్ వ్రాయఁగాఁ - దృషతో నిటనుంటి దేవి నా 
కెలుఁగున కౌదువా స్ఫూర్తిగా - నిలపై నిఁకపైన భారతీ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
manOhara - 

aadhAramu - kalpitamu
naDaka - chaMpakamAla, chaMpakamAlayaMdali 8,9 axaramulaina laghuvulanu guruvugA chEsinappuDu labhiMchina vRttamu.

manOhara - na/ja/ta/bha/bha/ra/laga 
20 kRti 355632 

chaMpakamAla layatO - #IIII UIU UI - UII UII UIUIU#

sumadhura rAtrilO nIvu - suMdara hAsamutODa nilva@MgA@M 
gamalamu pUchinaTluMDe@M - gairavalOchani chaMdrakAMtilO 
vimalamu prEma bhAvammu - viSvamanOhara rAga raMjitaM 
bamalamu mAnasammiMdu - naMbarasImala@M dA@MkuchuMDenE 

kanulanu vrAtuvA gIti - kammani tETa tenuMgulOna nA 
kaniSamu nIve yaMdammu - harshasudhAMSavibhAtaraMgamul 
kana@Mganu rammu raMjilla@M - gAmitamul rasapUrNa yAminin 
danu viTa vEche@M nIkai ni-tAMta nirIxaNatO vilAsinI 

saMpa@Mgi layatO - #IIII UIU UIU - IIU IIUI UIU#

himamunu goMDapai@M jUDa@MgA - nedalO@M bratirOju SOkamE 
sumamulu nElapai rAla@MgA - sugamE kanarAdu tIvakun 
mamatala pushpamul vADa@MgA - manamaM doka grIshma kAlamE 
bhramamula madhyalO nidrayA - ramaNI virahaMpu rugmamE 

nilayamu nIvegA vidyakun - nidhigA madilOna@M daltu nin 
valayamu nIvegA vANikin - varadA varamimmu challa@MgA 
telu@Mguna gaitalan vrAya@MgA@M - dRshatO niTanuMTi dEvi nA 
kelu@Mguna kauduvA sphUrtigA - nilapai ni@Mkapaina bhAratI 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: