[racchabanda] నాగిని #nAgini#

 

నాగిని - 

ఆధారము - కల్పితము
నడక - చంపకమాల; చంపకమాలయందలి ఐదవ అక్షరమైన గురువును రెండు లఘువులుగా చేయగా లభించిన వృత్తము ఇది. 

నాగిని - న/న/జ/స/స/స/జ/గ   
22 ఆకృతి 1423232 

చంపకమాల లయతో - IIII IIIU III - UII UII UIUIU

ప్రణయము విరియు నీ రజని - రమ్యము తారక లాకసమందు నా 
కనయము ప్రియము నీ నగవు - లాశలు వెన్నెలయందుఁ గాంతులే 
మనసను పసిఁడి మందసపు - మానికముల్ సొగసీనుచుండఁగా 
నను గనఁ ద్వరగ రా మలఁగి - నాగినివోలె నటింతు మోడితో

వదనము కమలమా సకికి - వాడని వన్నెలతోడ నుండునా 
యధరము లరుణ బింబములొ - యాగని తీయని తేనెసోనలో 
పదములు ముదపు పల్లవియొ - బంధుర మాడెడు నృత్యగీతమో 
మది యిట మదనమోహనము - మాధవమందున మాయలోఁ బడెన్ 

సంపఁగి లయతో (4,5,5 - 4,5,5 మాత్రలు) - IIII IIIU IIIU - IIU IIUI UIU

కదలెడు సుమము లా వనములో - కవితామృతగంధ మంపెనా 
మెదలెడు పవన మా వనములో - మృదులమ్ముగ వీచుచుండెనా 
ముదమిడు రవము లా వనములో - పులకించఁగ మ్రోఁగుచుండెనా 
హృదయము వెలుఁగ నా వనములోఁ - బ్రియరాగము లొల్కుచుండెనా 

కవితలు సరసమా సరసమా - కలముల్ నయనమ్ములా చెలీ 
రవములు మధురమా మృదులమా - రజనీకర కాంతిలో సకీ 
దివియలు సొబగులా సవురులా - దివి జారిన వెల్గు రేకలా 
భవ మిఁక నవముగా ధ్రువముగా - వరమై వఱలున్ గదా సదా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
nAgini - 

aadhAramu - kalpitamu
naDaka - chaMpakamAla; chaMpakamAlayaMdali aidava axaramaina guruvunu reMDu laghuvulugA chEyagA labhiMchina vRttamu idi. 

nAgini - na/na/ja/sa/sa/sa/ja/ga  
22 aakRti 1423232 

chaMpakamAla layatO - #IIII IIIU III - UII UII UIUIU# 

praNayamu viriyu nI rajani - ramyamu tAraka lAkasamaMdu nA 
kanayamu priyamu nI nagavu - lASalu vennelayaMdu@M gAMtulE 
manasanu pasi@MDi maMdasapu - mAnikamul sogasInuchuMDa@MgA 
nanu gana@M dvaraga rA mala@Mgi - nAginivOle naTiMtu mODitO

vadanamu kamalamA sakiki - vADani vannelatODa nuMDunA 
yadharamu laruNa biMbamulo - yAgani tIyani tEnesOnalO 
padamulu mudapu pallaviyo - baMdhura mADeDu nRtyagItamO 
madi yiTa madanamOhanamu - mAdhavamaMduna mAyalO@M baDen 

saMpa@Mgi layatO (4,5,5 - 4,5,5 mAtralu) - #IIII IIIU IIIU - IIU IIUI UIU# 

kadaleDu sumamu lA vanamulO - kavitAmRtagaMdha maMpenA 
medaleDu pavana mA vanamulO - mRdulammuga vIchuchuMDenA 
mudamiDu ravamu lA vanamulO - pulakiMcha@Mga mrO@MguchuMDenA 
hRdayamu velu@Mga nA vanamulO@M - briyarAgamu lolkuchuMDenA 

kavitalu sarasamA sarasamA - kalamul nayanammulA chelI 
ravamulu madhuramA mRdulamA - rajanIkara kAMtilO sakI 
diviyalu sobagulA savurulA - divi jArina velgu rEkalA 
bhava mi@Mka navamugA dhruvamugA - varamai va~ralun gadA sadA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: