[racchabanda] సంద్రము #saMdramu#

 

సంద్రము - 

ఆధారము - కల్పితము
నడక - చంపకమాల; చంపకమాలయందలి ఏడవ అక్షరమైన గురువు ఇందులో రెండు లఘువులు 

సంద్రము - న/జ/న/స/స/స/జ/గ 
22 ఆకృతి 1423344 

చంపకమాల లయతో - IIII UIII III - UII UII UIUIU  

వనమునఁ బుష్పములు విరిసె - వాంఛల పుష్పము లెప్డు పూయునో 
కనులను బాష్పములు గురిసెఁ - గాంక్షల జల్లు లవెప్డు రాలునో
మనమున మంథనము గలిగె - మంథర పర్వత మెప్డు చిల్కునో 
తనువున స్పందనలు ములిగె - ధ్వాంతమునందున స్వప్న మెప్పుడో 

తరుణ వసంత మిది కనఁగ - ధారుణి నిండెను బుష్పరాశితో 
కిరణము లెల్లయెడఁ గనఁగఁ - గ్రీడలఁ జేయుచునుండె చైత్ర మా-
భరణములయ్యె నిటఁ గనఁగ - బంగరు రంగులు భాసిలంగ నీ 
స్మరణమె నాకు నిను వదలి - మ్రగ్గుచునుంటి వసంతమందు నేన్ 

సంపఁగి లయతో - IIII UIII IIIU - IIU IIUI UIU 

పలుకుల తల్లి నను గనఁగ రా - వరదా దయఁ జూపుమా సదా 
అలరుల మాలలను గొనఁగ రా - యమలా యవి నీకు కైతలే 
వెలుఁగుల నింపగను ద్వరగ రా - ప్రియమై యనురాగ దీప్తితో 
దలఁపుల సంతసము నొసఁగ రా - తరుణీ కరుణాబ్ధి ఫేనమై 

నగవుల ఱేఁడు నను బిలుచునా - నయమై నను జూచి నవ్వునా 
వగపులఁ బాపి నను వలచునా - ప్రణయాంకిత ముద్ర లిచ్చునా 
సుగముల సంద్రమున మునుచునా - సుమమాలల నాకు వేయునా 
జగమున వాఁడెపుడు నొడయఁడే - ఛవితో నలరారు దేవుఁడే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
saMdramu - 

aadhAramu - kalpitamu
naDaka - chaMpakamAla; chaMpakamAlayaMdali EDava axaramaina guruvu iMdulO reMDu laghuvulu 

saMdramu - na/ja/na/sa/sa/sa/ja/ga 
22 aakRti 1423344 

chaMpakamAla layatO - #IIII UIII III - UII UII UIUIU#  

vanamuna@M bushpamulu virise - vaaMChala pushpamu lepDu pooyunO 
kanulanu baashpamulu gurise@M - gaaMkshala jallu lavepDu raalunO
manamuna maMthanamu galige - maMthara parvata mepDu chilkunO 
tanuvuna spaMdanalu mulige - dhvaaMtamunaMduna svapna meppuDO 

taruNa vasaMta midi kana@Mga - dhAruNi niMDenu bushparASitO 
kiraNamu lellayeDa@M gana@Mga@M - grIDala@M jEyuchunuMDe chaitra mA-
bharaNamulayye niTa@M gana@Mga - baMgaru raMgulu bhAsilaMga nI 
smaraName nAku ninu vadali - mragguchunuMTi vasaMtamaMdu nEn 

saMpa@Mgi layatO - #IIII UIII IIIU - IIU IIUI UIU# 

palukula talli nanu gana@Mga rA - varadA daya@M jUpumA sadA 
alarula mAlalanu gona@Mga rA - yamalA yavi nIku kaitalE 
velu@Mgula niMpaganu dvaraga rA - priyamai yanurAga dIptitO 
dala@Mpula saMtasamu nosa@Mga rA - taruNI karuNAbdhi phEnamai 

nagavula ~rE@MDu nanu biluchunA - nayamai nanu jUchi navvunA 
vagapula@M bApi nanu valachunA - praNayAMkita mudra lichchunA 
sugamula saMdramuna munuchunA - sumamAlala nAku vEyunA 
jagamuna vA@MDepuDu noDaya@MDE - ChavitO nalarAru dEvu@MDE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: