[racchabanda] దీపీకా #dIpikA#

 

దీపీకా - 

ఆధారము - కల్పితము 
Facebbokలో సుప్రియా రెడ్డిగారు ప్రచురించిన  
అభ్రపథమ్మున - విభ్రమ విలసిత - శుభ్రకౌముదీ దీపికా 
అనే పంక్తి ఈ వృత్తమునకు స్ఫూర్తి. 
నడక - నాలుగు చతుర్మాత్రలు, రెండు చతుర్మాత్రలు కాని ఒక అష్టమాత్ర, ఒక పంచమాత్ర. ఇటువంటి తాళ వృత్తములకు ప్రాసయతి బాగుంటుంది. క్రింద నా ఉదాహరణములు - 

దీపికా - భ/భ/భ/న/జ/ర/ర UII UII - UII IIII - UIUIU UIU
21 ప్రకృతి 614327 

అభ్రపథమ్మున - విభ్రమ విలసిత - శుభ్రకౌముదీ దీపికా 
నా భ్రమమందు ప-రిభ్రమ సలుపు సి-తాభ్రవర్ణికా దీప్తికా 
దభ్రము కోరిక - దిగ్భ్రమ గలిగె న-దభ్ర మయ్యె నా బాధలే 
ఈ భ్రమ మాన్పఁగ - నుద్భ్రమ మొలుకఁగ - రా భ్రమించఁ సమ్మోదమై 
(సితాభ్ర = కర్పూరమువలె తెల్లని; దభ్రము = సూక్ష్మము, సన్నదనము; అదభ్ర = ఎక్కువగా; ఉద్భ్రమము = ఉద్వేగము)

ఆకసమందున - జీఁకటి దొలఁగఁగ - రాకలోనఁ జంద్రద్యుతుల్ 
మ్రాఁకులలోఁగల - యాకుల యలికిడి - నాకు నీ స్మృతిన్ దెచ్చెనే 
రాకకు వేచితి - నీకయి ప్రియతమ - నాకు దర్శన మ్మీయవా 
వేకువ వచ్చును - నాకు మిగిలినవి - గాఁకతోడ బాష్పమ్ములా 

వేణు రవమ్ములు - వీణియ పలుకులు - గానగంగలో నూర్మికల్ 
వాణికిఁ బ్రీతిగ - శ్రేణిగఁ బదముల - మేను పొంగఁగాఁ బాడుమా 
గానము నిక్కము - ప్రాణపు టమృతము - వాన జల్లుగా రాలి యీ 
మానసమందునఁ - ద్రాణము నినుపును - నేను నీవు ప్రేమించఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
dIpIkA - 

aadhAramu - kalpitamu 
#Facebbok#lO supriyA reDDigAru prachuriMchina  
abhrapathammuna - vibhrama vilasita - SubhrakaumudI dIpikA 
anE paMkti ee vRttamunaku sphUrti. 
naDaka - nAlugu chaturmAtralu, reMDu chaturmAtralu kAni oka ashTamAtra, oka paMchamAtra. iTuvaMTi tALa vRttamulaku prAsayati bAguMTuMdi. kriMda nA udAharaNamulu - 

dIpikA - bha/bha/bha/na/ja/ra/ra #UII UII - UII IIII - UIUIU UIU#
21 prakRti 614327 

abhrapathammuna - vibhrama vilasita - SubhrakaumudI dIpikA 
nA bhramamaMdu pa-ribhrama salupu si-tAbhravarNikA dIptikA 
dabhramu kOrika - digbhrama galige na-dabhra mayye nA bAdhalE 
ee bhrama mAn&pa@Mga - nudbhrama moluka@Mga - rA bhramiMcha@M sammOdamai 
(sitAbhra = karpUramuvale tellani; dabhramu = sUxmamu, sannadanamu; adabhra = ekkuvagA; udbhramamu = udvEgamu)

aakasamaMduna - jI@MkaTi dola@Mga@Mga - rAkalOna@M jaMdradyutul 
mrA@MkulalO@Mgala - yAkula yalikiDi - nAku nI smRtin dechchenE 
rAkaku vEchiti - nIkayi priyatama - nAku darSana mmIyavA 
vEkuva vachchunu - nAku migilinavi - gA@MkatODa bAshpammulA 

vENu ravammulu - vINiya palukulu - gAnagaMgalO nUrmikal 
vANiki@M brItiga - SrENiga@M badamula - mEnu poMga@MgA@M bADumA 
gAnamu nikkamu - prANapu TamRtamu - vAna jallugA rAli yI 
mAnasamaMduna@M - drANamu ninupunu - nEnu nIvu prEmiMcha@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#


__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: