[racchabanda] జమిలి #jamili#

 

జమిలి - 

ఆధారము - కల్పితము 
ఇది ఒక ద్విపద - మొదటి పాదములో ద్విపద లక్షణాలు, రెండవ పాదములో చివరి సూర్య గణమునకు బదులు ఒక గురువు. ఇట్టి ఛందస్సుతో పాటలు ఉన్నాయి. జమిలి అంటే జంట. 

జమిలి - ఇం/ఇం - ఇం/సూ // ఇం/ఇం - ఇం/గ

కలలోన నను గాంచు - కమలాక్షి యెవరొ 
యిలలోన గన నౌనె - యెందుండెనో 

సరసమ్ము లాడుఁ దా - క్షణమొండు పిదప 
విరహమ్ములో ముంచి - వెళ్లు గాదా 

చిత్రమ్ము వ్రాయఁగాఁ - జేత కాదయ్యె 
మిత్రమా నాకింక - మృత్యువేనా 

పచ్చగాఁ జిలక లా - పాదపమ్మందు 
వెచ్చగాఁ బాట లీ - వేణువందు 

లలితమ్ము నీరూపు - లలితమ్ము చూపు 
లలితాంగ రావేల - లలన నీదే 

తెలిమంచుఁ దొలగించఁ - దిమిరారి తోఁచె 
కలనాద మెందెందుఁ - గలిగించెనే 

అందాల రాచిల్క - కానంద మెందు 
బందీగ నుండంగ - బాధయేగా 

నీవు నాతోనుండ - నిక్కమ్ము జమిలి 
నీవు లేకుండగా - నేనొంటిగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
jamili - 

aadhAramu - kalpitamu 
idi oka dvipada - modaTi pAdamulO dvipada laxaNAlu, reMDava pAdamulO chivari sUrya gaNamunaku badulu oka guruvu. iTTi ChaMdassutO pATalu unnAyi. jamili aMTE jaMTa. 

jamili - iM/iM - iM/sU // iM/iM - iM/ga

kalalOna nanu gAMchu - kamalAxi yevaro 
yilalOna gana naune - yeMduMDenO 

sarasammu lADu@M dA - xaNamoMDu pidapa 
virahammulO muMchi - veLlu gAdA 

chitrammu vrAya@MgA@M - jEta kAdayye 
mitramA nAkiMka - mRtyuvEnA 

paccagA@M jilaka lA - pAdapammaMdu 
veccagA@M bATa lI - vENuvaMdu 

lalitammu nIrUpu - lalitammu chUpu 
lalitAMga rAvEla - lalana nIdE 

telimaMchu@M dolagiMcha@M - dimirAri tO@Mche 
kalanAda meMdeMdu@M - galigiMchenE 

aMdAla rAchilka - kAnaMda meMdu 
baMdIga nuMDaMga - bAdhayEgA 

nIvu nAtOnuMDa - nikkammu jamili 
nIvu lEkuMDagA - nEnoMTigA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: