[racchabanda] ఖేటకము #khETakamu#

 

ఖేటకము - 

ఆధారము - కన్నడ ఛందస్సు 
నడక - చతురస్రగతి, మానినీవృత్తములో 1,3,5 భగణములకు బదులు న-లములు ఇందులోని విశేషము. 

ఖేటకము - న/జ/న/స/న/న/భ/భ/గ 
IIII UII - IIII UII - IIII UII - UIIU
25 అభికృతి 14415856 

కనులకు విందుగఁ - గమలము పూచెను - గంధము లెల్లెడఁ బర్వెనులే 
దినమున వెల్గులు - దెసలను రంగులు - తెలి యల పొంగులు చిత్రములే 
గణగణ గంటల - కలసిన జంటల - కాముని తంటల నాదములే 
వినగను మాటలు - ప్రియమగు పాటలు - విలసిలు తోటలు హ్లాదములే 

శర షట్పదిగా - 

మనసునఁ బూవులు 
తనువునఁ దావులు 
నను గన రమ్మిఁక - నాకములే 
స్వనములు నిండఁగ 
దినమొక పండుగ 
ప్రణయపు గీతికఁ - బాడఁగ రా 

వికసిత సూనము 
ముకుళిత హాసము 
మొకమున భాసము - మోహనమే
సుకముల నాదము 
ప్రకటిత మోదము 
లిఁక మన కెప్పు డ-దృష్టములే 

వలపుకు ఖేటక 
మిల హృది నమ్మిక 
తలఁపులు వాడని - తామరలే 
కలసిన వేళయు 
కలలకు రూపము 
చెలువము లాడెడు - చిందులుగా 
(ఖేటకము = డాలు)

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
khETakamu - 

aadhAramu - kannaDa ChaMdassu 
naDaka - chaturasragati, mAninIvRttamulO 1,3,5 bhagaNamulaku badulu na-lamulu iMdulOni viSEshamu. 

khETakamu - na/ja/na/sa/na/na/bha/bha/ga 
#IIII UII - IIII UII - IIII UII - UIIU#
25 abhikRti 14415856 

kanulaku viMduga@M - gamalamu pUchenu - gaMdhamu lelleDa@m barvenulE 
dinamuna velgulu - desalanu raMgulu - teli yala poMgulu chitramulE 
gaNagaNa gaMTala - kalasina jaMTala - kAmuni taMTala nAdamulE 
vinaganu mATalu - priyamagu pATalu - vilasilu tOTalu hlAdamulE 

Sara shaTpadigA - 

manasuna@M bUvulu 
tanuvuna@M dAvulu 
nanu gana rammi@Mka - nAkamulE 
svanamulu niMDa@Mga 
dinamoka paMDuga 
praNayapu gItika@M - bADa@Mga rA 

vikasita sUnamu 
mukuLita hAsamu 
mokamuna bhAsamu - mOhanamE
sukamula nAdamu 
prakaTita mOdamu 
li@Mka mana keppu Da-dRshTamulE 

valapuku khETaka 
mila hRdi nammika 
tala@Mpulu vADani - tAmaralE 
kalasina vELayu 
kalalaku rUpamu 
cheluvamu lADeDu - chiMdulugA 
(khETakamu = DAlu)

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: