[racchabanda] మాధవీలతా #mAdhavIlatA#

 

మాధవీలతా - 


ఆధారము - రత్నమంజూష, హేమచంద్రుడు 


ఈ వృత్తము స్రగ్ధరను బోలినది. మొదటి భాగము స్రగ్ధరలోవలెనే, రెండవ భాగములో మొదటి చతుర్మాత్ర నలము కూడ స్రగ్ధర లాటిదే. రెండవ చతుర్మాత్ర స్రగ్ధరలో స-గణమైతే, ఇందులో భ-గణము. మూడవ భాగము స్రగ్ధరలో ర/ర/గ, ఇందులో ర/లగ. క్రింద నా ఉదాహరణములు - 


మాధవీలతా - మ/ర/భ/స/స/జ/గ UUUUIUU - IIII UII - UIUIU

19 అతిధృతి 178065 


మారుండీ నన్ను గాల్చెన్ - మధుర విభావరి - మాధవీలతా  

నారీరత్నమ్ము గానన్ - నలఁతల నుంటిని - నవ్వుచుంటివా

సారమ్మే లేక యుంటిన్ - సరసము శూన్యము - సాఁగు మన్కిలో 

భారమ్మీ జీవితమ్మే - బరవస మిక్కడ - వంచితమ్ముగా 


దేవీ కావంగ రావా - దినములు భారము - తృష్ణ హెచ్చుగా 

భావమ్మందుందు వీవే - భవమొక సంద్రము - భావి యెట్టులో 

జీవానందమ్ము నీవే - చెలువముఁ జూపుము - చిత్తశాంతికై 

నావైపా దృష్టి నిమ్మా - నగవులు వెల్గఁగ - నమ్మితిన్ నినున్ 


విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు

#

mAdhavIlatA - 


aadhAramu - ratnamaMjUSha, hEmachaMdruDu 


ee vRttamu sragdharanu bOlinadi. modaTi bhAgamu sragdharalOvalenE, reMDava bhAgamulO modaTi chaturmAtra nalamu kUDa sragdhara lATidE. reMDava chaturmAtra sragdharalO sa-gaNamaitE, iMdulO bha-gaNamu. mUDava bhAgamu sragdharalO ra/ra/ga, iMdulO ra/laga. kriMda nA udAharaNamulu - 


mAdhavIlatA - ma/ra/bha/sa/sa/ja/ga #UUUUIUU - IIII UII - UIUIU#

19 atidhRti 178065 


mAruMDI nannu gAlchen - madhura vibhAvari - mAdhavIlatA  

nArIratnammu gAnan - nala@Mtala nuMTini - navvuchuMTivA

sArammE lEka yuMTin - sarasamu SUnyamu - sA@Mgu man&kilO 

bhArammI jIvitammE - baravasa mikkaDa - vaMchitammugA 


dEvI kAvaMga rAvA - dinamulu bhAramu - tRshNa hechchugA 

bhAvammaMduMdu vIvE - bhavamoka saMdramu - bhAvi yeTTulO 

jIvAnaMdammu nIvE - cheluvamu@M jUpumu - chittaSAMtikai 

nAvaipA dRshTi nimmA - nagavulu velga@Mga - nammitin ninun 


vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu

#



__._,_.___

Posted by: jkmrao@yahoo.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: