[racchabanda] వరివసితా #varavasitA#

 

వరివసితా - 

ఆధారము - కాకవిన్ రామాయణము, వాగ్వల్లభ
నడక - చతురస్ర గతి
తోటక వృత్తములోని మూడవ స-గణమును నలముగా మార్చినప్పుడు ఈ వృత్తము లభిస్తుంది. 
వరివసిత అంటే ఉపాసించబడిన వాడు అని అర్థము. 

వరివసితా - స/స/న/న/గ IIU IIU - IIII IIU
13 అతిజగతి 4060 

తెలవారెనుగా - తెలి వెలుఁగులతో 
చలి వీడెనుగా - సవితృని ప్రభతో 
గళ మెత్తఁగ రా - కలరవములతో 
నల దేవునికై - యలరుల సరులన్ 

అనుమానములా - హరిణనయనపై 
వనమాలి యిటన్ - వదలితి విటులన్ 
బ్రణతోఽస్మి హరీ - వర మొసఁగఁగ రా 
మనమందున నీ - మధురపు స్మృతులే 

నిను నా మదిలో - నిజ వరివసితుం 
డని తల్చితి మో-హన వర వరదా 
కన రమ్ము హరీ - కలువల కనులన్ 
నను నీ రజనిన్ - నగవుల మొగమై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
varivasitA - 

aadhAramu - kAkavin rAmAyaNamu, vAgvallabha
naDaka - chaturasra gati
tOTaka vRttamulOni mUDava sa-gaNamunu nalamugA mArchinappuDu ee vRttamu labhistuMdi. 
varivasita aMTE upAsiMchabaDina vADu ani arthamu. 

varivasitA - sa/sa/na/na/ga #IIU IIU - IIII IIU#
13 atijagati 4060 

telavArenugA - teli velu@MgulatO 
chali vIDenugA - savitRni prabhatO 
gaLa metta@Mga rA - kalaravamulatO 
nala dEvunikai - yalarula sarulan 

anumAnamulA - hariNanayanapai 
vanamAli yiTan - vadaliti viTulan 
braNatO@2smi harI - vara mosa@Mga@Mga rA 
manamaMduna nI - madhurapu smRtulE 

ninu nA madilO - nija varivasituM 
Dani talchiti mO-hana vara varadA 
kana rammu harI - kaluvala kanulan 
nanu nI rajanin - nagavula mogamai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: