Voyeurs పొద్దున్నే కళ్లు విప్పగానే, ఇతడి దివ్య దర్శనం. ఆకాశంలో తెల్లని చంద్రుడు. రాత్రి షేడ్స్ దించకుండానే నిద్రపోయాను. ఉన్నది పై అంతస్థు, వెనకంతా అడివే కదా, దించక పోతే ఏం అని. పొద్దున్నే ఇతగాడు. తెల్లని చల్లని చంద్రుడు. కంఫర్టర్ తొలిగించనా? వద్దా? అని ఒక క్షణం సందిగ్ధత. Me too మూవ్మెంట్ గురించి ఇతనికేం పట్టినట్టు లేదు. అమెరికన్ బిగ్ డేడీ లంతా కటకటాల వెనక కటకట లాడే కాలం వచ్చింది. ఈ చంద్రుడికి ఏమీ సొయ్ లేదు. ఎంతసేపట్నుంచీ ఇంజెక్ట్ చేస్తున్నాడో ఆ వేల వేల కిరణాలతో నాలోకి డ్రగ్స్. అసలందుకే నేను నిద్ర పోయానేమో! ఆ తర్వాతేం జరిగిందో! లాయర్ని పిలవనా? ఛ.. ఛ! ఏం భయం లేదు ఇతనికి నానుండి. Vice versa. నా వైద్య వృత్తిలో నేనెన్ని బాడీలు చూసి ఉన్నాను! నేను చూడని అశ్లీల మేమిటి! ఇప్పుడీ తెల్లని వాడికి నేనో నల్లని మచ్చ తగిలించనా? నా వయసెంత? చంద్రుని వయసెంత! ఇతని మీద, పాపం, ఇప్పటికే లక్షల కోట్ల కేసులున్నాయి. బనాయించని ఆడా మగా లేరు. తిట్టిన వారే కాని తిట్టని వారు లేరే. వందల కోట్ల ఆపెరా సింగర్స్, స్త్రీ పురుషులు, అన్ని దేశాల వాళ్లూ, ఎన్నెన్ని ఉపాలంభనాలు చేసినారు! ఐనా ఈ చంద్రుడికి భయం లేదు! పొలిటికల్ సీన్ మళ్లీ మారిపోయిందని, మనిషి మనిషీ మధ్య పాత రంకులన్నీ కొత్త లెన్స్ లతో చూస్తున్నారని సరికొత్త empowerment లు embarassent లు harassment లు వచ్చాయనీ ఇతనికి తెలీదా? ఐనా, ఆ ఆకాశంలో పొద్దున్నే ఆ నిరీక్షణ! నాకు ఆశ్చర్యమయ్యింది అతని మారని అలవాటుకు. No. no. I know him. He is a caring guy. He is not human. He is an iridescent innocent. I like him. అతనిని కొంచెం ముద్దు చెయ్యాలనిపించింది. ముఖం సవర దియ్యాలనిపించింది. My little white puppy in the sky. Come over here. You little round you! Let us Tumble in the bed a little. How long were you there! Aren't you cold sweetie! అసంబద్ధపు నా ఆ - pie in the sky - ప్రేమకు, నవ్వుకుంటూ లేచి, కాండోలో ఇటుపక్కకు వస్తే The sun is scorching the skies already. He is so bright and energetic. Increasing his radiance by the second! Glory! Glory! Halleluiah! I love it when these guys greet me from opposite sides Of my home at the same time. Charge me guys! Charge my batteries. Lyla.
Posted by: lylayfl@aol.com
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (248) |
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
No comments:
Post a Comment