Listen You "మహానటి" అంటూనే అదే నాలుకతో జీవితం, చావుల గురించి నీ విరసపు జాలిమాటలు దేనికి? ఆమెకు లీగల్ మొగుడు లేడనో, ఉన్నా మొగుడికి రంకులున్నాయనో ఆమె మొగుడిని కొంగుకు కట్టెయ్యలేకపోయిందనో ఉన్న డబ్బంతా ఊరు వాళ్లు ఊడ్చుకుపోయారనో ఇలా ఆ స్త్రీ మీద నీకు అసహనం. అధిక సంపాదన కలిగిన స్త్రీ పరిస్థితి నీ స్థితి కన్నా, నీ దృష్టిలో ఎందుకో హీనం; నీ ఉద్దేశంలో ఆ స్త్రీ ఉదారత, ఆమె తెలివితక్కువతనానికి నిదర్శనం. తెలుగు చరిత్రలో, సినిమా పాటలో సిల్లీ కూనలమ్మ పదాలో రాసిన, మరో మరోటో చేసిన నీ మొగుడు మాత్రం, నిన్ను ఘనంగా చూసాడు అని నీ అభిప్రాయం. మీది ఆదర్శ సంసారం, అని ప్రపంచానికి చెప్పుకుంటావు నువ్వు సత్యభామ ననుకుంటావు మొగుడిని కొంగుకు కట్టేసుకున్నాననుకుంటావు ఆ తెలివితేటల బతుకుకు నువ్వు క్రెడిట్ తీసుకుంటావు, అతని జుట్టు, పర్సు, నీ చేతుల్లో పెడితే అతడు ఉదారుడు, మంచివాడు; నిన్నుమాత్రం మొగుడి డబ్బుతో జల్సా చేసిన ఆడదానిగా చూసుకోవు నీ మొగుడు నీ తొత్తు, తెలివితక్కువ కుంక, నువ్వో లేజీ లీఛ్ వని నువ్వనుకోవు. అదోరకం ఫెమినిజం! అమ్మలూ ఇంట్లో నీ మొగుడి వడిలో నువ్వు చచ్చినా, నర్సింగ్‌హోమ్ లో చచ్చినా, కార్ షెడ్లో చచ్చినా, బాత్ టబ్‌లో చచ్చినా, బంధువులంతా ఏంజెల్స్ లా చుట్టూతా మూగి నోట్లో గుడ్డలు కుక్కుకుని వెక్కులు మింగుతుండగా చచ్చినా ఆఖరుకు అన్ని చావులూ ఒకటే; ప్రతి ప్రాణి ఒంటిగానే చావాలి, నువ్వూ నేనూ ఎవరం చచ్చినా ఒంటిగానే చావాలి, చివరకు మిగిలేది? చచ్చేప్పుడు అప్పుడెలా ఉంటుందో, ఆ మాటకొస్తే, అసలుకు పుట్టేప్పుడు తనకు అప్పుడెలా ఉండిందో, సొంత నెరేషన్ లో ఏ మనిషీ, ఇంతవరకూ నాకు చెప్పలేదు. నేను వినలేదు. Lyla
Posted by: lylayfl@aol.com
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (54) |
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
No comments:
Post a Comment