How in the world అతడు సినిమా కవి కాదు, ఇతరుల ప్రేమ సన్నివేశాలకు పాటలు రాయడు. కమర్షియల్ కవి కాదు, డ్యూయెట్లు రాయడు. ఇలస్ట్రేషనిస్ట్ కాదు, పదంలో ఎవరి కథనో గీయడు. ఆ కవితలు ఆడియన్స్ కోసం అల్లేవి కావు; కవి గారికి ఏ మాటకు ఎక్కడ చిరునవ్వు మొలుస్తుందో, ఎక్కడ కరతాళధ్వనులు కురుస్తాయో తెలియదు. అతడు తనతో గొప్పకవిత్వం చెప్పించటానికి, తనను సెబాస్ అంటానికి – వాణిని, వాణిశ్రీని పిలవడు, (Such an explicit selfish call, Isn't it a total turn off!) తన తాగుడు పాటకు జయప్రదమెలికలు తిరిగేందుకు పింప్ లతో పడి ముషాయిరాకు పోడు గద. అసలుకి అనపెస్ట్, స్పాండీ, ఇయాంబ్ లు తెలుసునా అని అతనికి. అట్టి ఆ అనాగరికుడిని చదువుతావు నువ్వు. ఆ రోజులలో నీలో పెల్లుబికే అందం ఆనందం అపరిచితులను మోహితులను చేస్తుంది. వారు పనిమాలా లేచొచ్చి నిన్ను కారణాలడుగుతారు. నువ్వాశ్చర్యపోయి వీరెవరు, ఏమంటున్నారని నీలో తర్కించుకుంటావు. నీ హృదయం ఒక నిరంతర ఆనంద ఝరిని నీలో ప్రసరింపజేస్తున్నదని, ఆ ట్రాన్స్ఫ్యూజన్ అతనిదని నీకు స్ఫురిస్తుంది. -Lyla
Posted by: lylayfl@aol.com
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (55) |
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
No comments:
Post a Comment