[racchabanda] అర్ధసమ వృత్తము కేతుమతి #ardhasama vRttamu kEtumati#

 

అర్ధస వృత్తము కేతుమతి - 

ఆధారము - పింగళ ఛందస్సు, నాట్యశాస్త్రము, లక్షణసారసంగ్రహము 

బేసి పాదములు - స/జ/స/గ (ప్రమితా, మాలా)
సరి పాదములు - భ/ర/న/గగ 

సంస్కృతములో యతి లేదు, తెలుగులో ఏడవ అక్షరము యతి

నను జూడవేల - నగుమోమున్ 
దీనుని వేగ మీ - దినము దేవీ 
వినవేల బాధ - వినతుల్ నీ 
వీనుల జేరవో - విభవవల్లీ 

అరుదెంచవేల - హరి నాకై 
కోరితి నిన్ను సం-కులము లేలా 
వర వేణుగీతి - పలుకుల్ నన్ 
జేరఁగ రమ్మురా - సిరిగ దల్తున్ 

ఈ కేతుమతి అర్ధసమ వృత్తమును నా ఉద్దేశములో రెండేసి పాదములను చేర్చి పాడాలి. 
-IIUI UIII UU - బేసి పాదములు 
UIIUI UIII UU - సరి పాదములు 

రెండవ ఫాదములోని మొదటి అక్షరమును తొలగిస్తే రెండు పాదములు ఒకే విధముగా నున్నాయి. క్రింది విధముగా కేతుమతిని వ్రాస్తే చక్కగా పాడుకొన వీలగును. 

కేతుమతి - స/జ/స/గ // భ/ర/న/గగ
IIUI UIII UU // U IIUI UIII UU 

రతివోలె రమ్ము దరిజేరన్ - భా 
రతివోలె రాగములఁ బాడన్ 
మతి నిన్ను మానినిగఁ గోరెన్ - స 
మ్మతి నిమ్ము మంగళము గల్గున్

వనమాలి పాటలను విన్నన్ - నా 
మనమందు మల్లియలు పూయున్ 
కన వాని గమ్మదన మబ్బున్ - మో
హనుఁ డన్న హర్ష మది యుబ్బున్ 

స్వర రాగ వల్లకిని మీటన్ - సం 
బరమొందు భారతి నిజమ్మై 
సరసాలఁ జంద్రుఁ డట వెల్గెన్ - గా 
వర నన్ను వాంఛ లిటఁ బొంగెన్ 

తలఁపందు తథ్యముగ నీవే - నా
వలపొక్క స్వప్నమగు నేమో 
కల యొక్క కమ్మదన మేమో - ము
వ్వల మ్రోఁత వాంఛలను బెంచున్ 

పిక మొండు పిల్వ మదిలోనన్ - దీ
పకరాగ పల్లవియు మ్రోఁగెన్ 
సక రమ్ము సందె వెలుఁగందున్ - హా 
సిక లిచ్చుఁ జెల్మికి సుఖమ్మై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu kEtumati - 

aadhAramu - piMgaLa ChaMdassu, nATyaSAstramu, laxaNasArasaMgrahamu 

bEsi pAdamulu - sa/ja/sa/ga (pramitA, mAlA)
sari pAdamulu - bha/ra/na/gaga 

saMskRtamulO yati lEdu, telugulO EDava axaramu yati

nanu jUDavEla - nagumOmun 
dInuni vEga mI - dinamu dEvI 
vinavEla bAdha - vinatul nI 
vInula jEravO - vibhavavallI 

arudeMchavEla - hari nAkai 
kOriti ninnu saM-kulamu lElA 
vara vENugIti - palukul nan 
jEra@Mga rammurA - siriga daltun 

ee kEtumati ardhasama vRttamunu nA uddESamulO reMDEsi pAdamulanu chErchi pADAli. 
#-IIUI UIII UU# - bEsi pAdamulu 
#UIIUI UIII UU# - sari pAdamulu 

reMDava PAdamulOni modaTi axaramunu tolagistE reMDu pAdamulu okE vidhamugA nunnAyi. kriMdi vidhamugA kEtumatini vrAstE chakkagA pADukona vIlagunu. 

kEtumati - sa/ja/sa/ga // bha/ra/na/gaga
#IIUI UIII UU // U IIUI UIII UU# 

rativOle rammu darijEran - bhA 
rativOle rAgamula@M bADan 
mati ninnu mAniniga@M gOren - sa 
mmati nimmu maMgaLamu galgun

vanamAli pATalanu vinnan - nA 
manamaMdu malliyalu pUyun 
kana vAni gammadana mabbun - mO
hanu@M Danna harsha madi yubbun 

svara rAga vallakini mITan - saM 
baramoMdu bhArati nijammai 
sarasAla@M jaMdru@M DaTa velgen - gA 
vara nannu vAMCha liTa@M boMgen 

tala@MpaMdu tathyamuga nIvE - nA
valapokka svapnamagu nEmO 
kala yokka kammadana mEmO - mu
vvala mrO@Mta vAMChalanu beMchun 

pika moMDu pilva madilOnan - dI
pakarAga pallaviyu mrO@Mgen 
saka rammu saMde velu@MgaMdun - hA 
sika lichchu@M jelmiki sukhammai 

vidhEyuDu - jejjAla kRShNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: