[racchabanda] అర్ధసమవృత్తము మణివితానకాంతి ##ardhasamavRttamu maNivitAnakAMti

 

అర్ధసమవృత్తము మణివితానకాంతి - 

ఆధారము - లక్షణసారసంగ్రహము 

బేసి పాదములు - శుద్ధవిరాట్టు - మ/స/జ/గ UU UII - UIUIU
సరి పాదములు - రథోద్ధత - ర/న/ర/లగ UIUIII - UIUIU

బేసీ పాదములో 4,4 - 8 మాత్రలు, సరి పాదములో 8 - 8 మాత్రలు. ఇలా వ్రాస్తే పాదాలన్నీ ఒకే విధముగా ఉండక గతిలో స్వల్ప భేదము ఉంటుంది, అందువలన పాడుకొనడానికి బాగుంటుంది. 

నీవే దైవము - నిన్ను వేడితిన్ 
బ్రోవఁగా త్వరగఁ - ద్రోవఁ జూపరా 
నావైపా యెల - నవ్వు పువ్వులన్ 
బ్రోవుగా నొసఁగు - పుల్కలందఁగా 

అమ్మా చూడవె - యన్న కొట్టెనే 
తమ్ముఁ డేడ్చుచును - దల్లిఁ జేరఁగా 
రమ్మా నా దరి - భ్రాతఁ గొట్టెదన్
దమ్మి కన్నులను - దాను దుడ్చెనే 

పల్కుల్ నిక్కము - పారవశ్యమే 
తళ్కు లా మణివి-తానకాంతులే 
కుల్కుల్ లాస్యపు - గోపనమ్ములే 
చిల్క నాదరికిఁ - జేరు మెల్లఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasamavRttamu maNivitAnakAMti - 

aadhAramu - laxaNasArasaMgrahamu 

bEsi pAdamulu - SuddhavirATTu - ma/sa/ja/ga #UU UII - UIUIU#
sari pAdamulu - rathOddhata - ra/na/ra/laga #UIUIII - UIUIU#

bEsii pAdamulO 4,4 - 8 mAtralu, sari pAdamulO 8 - 8 mAtralu. ilA vrAstE pAdAlannI okE vidhamugA uMDaka gatilO svalpa bhEdamu uMTuMdi, aMduvalana pADukonaDAniki bAguMTuMdi. 

nIvE daivamu - ninnu vEDitin 
brOva@MgA tvaraga@M - drOva@M jUparA 
nAvaipA yela - navvu puvvulan 
brOvugA nosa@Mgu - pulkalaMda@MgA 

ammA chUDave - yanna koTTenE 
tammu@M DEDchuchunu - dalli@M jEra@MgA 
rammA nA dari - bhrAta@M goTTedan
dammi kannulanu - dAnu duDchenE 

palkul nikkamu - pAravaSyamE 
taLku lA maNivi-tAnakAMtulE 
kulkul lAsyapu - gOpanammulE 
chilka nAdariki@M - jEru mella@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: