[racchabanda] సౌరభక మొక విషమ వృత్తము #aurabhaka moka vishama vRttamu#

 

సౌరభక మొక విషమ వృత్తము - 

ఆధారము - పింగళ ఛందస్సు 
ఉద్గతలో మూడవ పాదము భ/న/జ/లగ అయితే ఇందులో అది ర/న/భ/గ. 

UIII III UIIU - ఉద్గత
UIU- III UIIU- సౌరభక 

ఇక్కడ ఒక విషయము చెప్పాలి. ఈ మధ్య నేను పరిచయము చేసిన సరసాల మేడ వృత్తము ఉద్గత మొదటి రెండు పాదములు. దీనిపైన ఆధార పడినదే కాకలీరవము అనే జాతి పద్యము. ఉద్గత మూడవ, నాలుగవ పాదములు చేర్చినప్పుడు నర్మిలి వృత్తము లభిస్తుంది. ఉద్గతలోని ఈ విషయాలను ఇంతవఱకు ఎవ్వరు చెప్పినట్లు లేదు. సౌరభకములోని మూడవ పాదపు గణములు వేరైనా, సౌరభకపు మూడవ, నాలుగవ పాదపు లయ నర్మిలివంటిదే (నాలుగు పంచమాత్రలు). 

పాదము 1 - స/జ/స/ల IIUIUI IIUI
పాదము 2 - న/స/జ/గ III IIUIUI U
పాదము 3 - ర/న/భ/గ UIUIII UIIU
పాదము 4 - స/జ/స/జ/గ II UIUIII UIUIU

భవతారిణీ కనుము నన్ను 
దివియలివి నీ వెలుంగుకై 
జీవపంకజము పూయఁగ నీ 
భువిపైనఁ బోయుము జలమ్ము ధారగా 

లలనామణీ వినుము పాట 
కలరవము లింపు నీయఁగా 
పాలు పొంగులిడు తీరు హృదిన్ 
జలియించుచుండె నిట హర్షఫేనముల్ 

రెండు పాదములు లయబద్ధముగా - 

వనజాక్షి దేవి వినుమమ్మ 
వినతిఁ బ్రణవస్వరూపమా 
వాణి నీయు మలివేణి వరా- 
నన ప్రాణమిమ్ము సురగానగంగగా 

వనజాక్షి దేవి 
వినుమమ్మ వినతిఁ 
బ్రణవస్వరూపమా 
వాణి నీయు మలి-
వేణి వరానన 
ప్రాణమిమ్ము సుర-
గానగంగగా 

వరవీణ మీట నరుదైన 
స్వరము లరుసమ్ము నీయఁగా 
వారిజాతముల సౌరభసుం-
దర సార వాహినిని రా రమించఁగా 

వరవీణ మీట 
నరుదైన స్వరము 
లరుసమ్ము నీయఁగా  
వారిజాతముల 
సౌరభసుందర 
సార వాహినిని 
రా రమించఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
saurabhaka moka vishama vRttamu - 

aadhAramu - piMgaLa ChaMdassu 
udgatalO mUDava pAdamu bha/na/ja/laga ayitE iMdulO adi ra/na/bha/ga. 

#UIII III UIIU# - udgata
#UIU- III UIIU#- saurabhaka 

ikkaDa oka vishayamu cheppAli. ee madhya nEnu parichayamu chEsina sarasAla mEDa vRttamu udgata modaTi reMDu pAdamulu. dInipaina aadhAra paDinadE kAkalIravamu anE jAti padyamu. udgata mUDava, nAlugava pAdamulu chErchinappuDu narmili vRttamu labhistuMdi. udgatalOni ee vishayAlanu iMtava~raku evvaru cheppinaTlu lEdu. saurabhakamulOni mUDava pAdapu gaNamulu vErainA, saurabhakapu mUDava, nAlugava pAdapu laya narmilivaMTidE (nAlugu paMchamAtralu). 

pAdamu 1 - sa/ja/sa/la #IIUIUI IIUI#
pAdamu 2 - na/sa/ja/ga #III IIUIUI U#
pAdamu 3 - ra/na/bha/ga #UIUIII UIIU#
pAdamu 4 - sa/ja/sa/ja/ga #II UIUIII UIUIU#

bhavatAriNI kanumu nannu 
diviyalivi nI veluMgukai 
jIvapaMkajamu pUya@Mga nI 
bhuvipaina@M bOyumu jalammu dhAragA 

lalanAmaNI vinumu pATa 
kalaravamu liMpu nIya@MgA 
pAlu poMguliDu tIru hRdin 
jaliyiMchuchuMDe niTa harshaphEnamul 

reMDu pAdamulu layabaddhamugA - 

vanajAxi dEvi vinumamma 
vinati@M braNavasvarUpamA 
vANi nIyu malivENi varA- 
nana prANamimmu suragAnagaMgagA 

vanajAxi dEvi 
vinumamma vinati@M 
braNavasvarUpamA 
vANi nIyu mali-
vENi varAnana 
prANamimmu sura-
gAnagaMgagA 

varavINa mITa narudaina 
svaramu larusammu nIya@MgA 
vArijAtamula saurabhasuM-
dara sAra vAhinini rA ramiMcha@MgA 

varavINa mITa 
narudaina svaramu 
larusammu nIya@MgA  
vArijAtamula 
saurabhasuMdara 
sAra vAhinini 
rA ramiMcha@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: