[racchabanda] కాకలీరవము - ఒక జాతి పద్యము #kAkalIravamu - oka jAti padyamu#

 

కాకలీరవము - ఒక జాతి పద్యము 

ఆధారము - కల్పితము, స్ఫూర్తి - సరసాల మేడ 
ఇంతకు ముందు తెలిపిన సరసాల మేడ వృత్తమునకు చివర ఒక గురువును చేర్చి మాత్రాగణముల రూపములో వ్రాసినది ఇది. ప్రతి పాదములో మూడు అష్టమాత్రలు, రెండు గురువులు. పాదాంత విరామయతి అవశ్యము. పాదాంతములో లఘువును కూడ ఉంచవచ్చును, కాని పాడుకొనేటప్పుడు అది గురుతుల్యమే. 

కాకలీరవము - అమా - అమా - అమా/చ (అమా = అష్టమాత్ర)

అక్షరసామ్య యతితో - 

ప్రేమకావ్యమున - ప్రీతి దీపమున - వెలుఁగు కాంతులో నీవు 
శ్యామలాభ్రమున - జలధరమ్ములోఁ - జపల చాపమో నీవు 
కామసఖములోఁ - గాకలీరవపు - కలకలధ్వనులొ నీవు 
శ్యామసుందరా - సరసమందిరా - స్వామి నీవె నా తావు

ప్రాసయతితో - 

నిను జూడ నాకు - మనమెల్ల నిండె - వనజాక్ష వేగ రావా 
ప్రణయమ్ము విరిసెఁ - గనులిందు మురిసెఁ - దనువిందుఁ దరిసె దేవా 
దినమయ్యె రాత్రి - వనమెల్ల శాంతి - కన నింగిఁ జంద్ర కాంతుల్ 
ప్రణయార్ద్ర గీతిఁ - దనివార పాడు - మనఘా స్రవించఁ దేనెల్ 

బాల సుకుమార - వ్రేల నగమెత్తు - నీలవపు నందబాలా
లీలలంచుఁ బలు - బాలలకు వ్యధలఁ - జాల కలిగింతు వేలా 
పూలతో నొక్క - డోలలో నిన్ను - దేలఁగా నూఁచి కననా 
పాలతోఁ బాత్రఁ - గేల నందించి - నీలిరాగమ్ముఁ గొననా 

విధేయుదు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kAkalIravamu - oka jAti padyamu 

aadhAramu - kalpitamu, sphUrti - sarasAla mEDa 
iMtaku muMdu telipina sarasAla mEDa vRttamunaku chivara oka guruvunu chErchi mAtrAgaNamula rUpamulO vrAsinadi idi. prati pAdamulO mUDu ashTamAtralu, reMDu guruvulu. pAdAMta virAmayati avaSyamu. pAdAMtamulO laghuvunu kUDa uMchavachchunu, kAni pADukonETappuDu adi gurutulyamE. 

kAkalIravamu - amA - amA - amA/cha (amA = ashTamAtra)

axarasAmya yatitO - 

prEmakAvyamuna - prIti dIpamuna - velu@Mgu kAMtulO nIvu 
SyAmalAbhramuna - jaladharammulO@M - japala chApamO nIvu 
kAmasakhamulO@M - gAkalIravapu - kalakaladhvanulo nIvu 
SyAmasuMdarA - sarasamaMdirA - svAmi nIve nA tAvu

prAsayatitO - 

ninu jUDa nAku - manamella niMDe - vanajAxa vEga rAvA 
praNayammu virise@M - ganuliMdu murise@M - danuviMdu@M darise dEvA 
dinamayye rAtri - vanamella SAMti - kana niMgi@M jaMdra kAMtul 
praNayArdra gIti@M - danivAra pADu - managhA sraviMcha@M dEnel 

bAla sukumAra - vrEla nagamettu - nIlavapu naMdabAlA
lIlalaMchu@M balu - bAlalaku vyadhala@M - jAla kaligiMtu vElA 
pUlatO nokka - DOlalO ninnu - dEla@MgA nU@Mchi kananA 
pAlatO@M bAtra@M - gEla naMdiMchi - nIlirAgammu@M gonanA 

vidhEyudu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: