[racchabanda] కొత్త విధమైన యతులతో పృథ్వీ వృత్తము #kotta vidhamaina yatulatO pRthvI vRttamu#

 

కొత్త విధమైన యతులతో పృథ్వీ వృత్తము - 

పృథ్వీ వృత్తపు పాదము సంస్కృతములో 8/9 అక్షరములుగా విఱుగుతుంది.. తెలుగులో 12వ అక్షరము యతి. నేను దీనికి తొమ్మిదవ అక్షరమును వడిగా, 12వ అక్షరమును ప్రాస యతిగా ఉంచి వ్రాసియున్నాను. ఈ రోజు 7, 13 అక్షరములతో వడిగా రెండు పద్యములను, అవే అక్షరములతో ప్రాస యతిని (8, 14 ప్రాసాక్షరములు) ఉంచి వ్రాసినాను. 

పృథ్వీ(తల) - జ/స/జ/స/య/లగ IUI IIU - IUI IIU - IUU IU
17 అత్యష్టి 38750 

తలిర్చు లత సుం-దరమ్ము పృథివీ-తలమ్మందు నేఁ
దలంతు నిను నో - దయార్ద్ర హృదయా - దహించెన్ గదా  
కలంగు యెదపైఁ - గరమ్ము లిడ రా - కటాక్షమ్ములన్ 
వెలుంగుకొఱకై - ప్రియా నిలిచితిన్ - విషాదమ్ముతో 

సుషుప్తి వదలెన్ - సుమమ్ము లలరెన్ - సువర్ణమ్ములన్ 
దుషార సర మా - దుకూలములపై - ద్రుటిన్ శోభిలెన్ 
ఉషోదయములో - నుషాంశువులతో - హొరంగుల్ ఛవుల్ 
విషాద మికపై - వెలుంగు వలలో - విలీనమ్మగున్ 

ప్రాస యతితో - 

సరస్వతి యనన్ - స్వరాలు కదలెన్ - సరాళమ్ముగా 
విరించి తరుణీ - విరాణ్ముఖి సుధా - సరిత్తై యిటన్ 
హరించు వెతలన్ - కరాంజలు లివే - విరాజిల్లుచున్ 
ధరాస్థలిని సం-హరించు వెడగున్ - స్మరింతున్ సదా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kotta vidhamaina yatulatO pRthvI vRttamu - 

pRthvI vRttapu pAdamu saMskRtamulO 8/9 axaramulugaa vi~rugutuMdi. telugulO 12va axaramu yati. nEnu dIniki tommidava axaramunu vaDigA, 12va axaramunu prAsa yatigA umchi vrAsiyunnAnu. ee rOju 7, 13 axaramulatO vaDigA reMDu padyamulanu, avE axaramulatO praasa yatini (8, 14 prAsAxaramulu) uMchi vrAsinAnu. 

pRthvI(tala) - ja/sa/ja/sa/ya/laga #IUI IIU - IUI IIU - IUU IU#
17 atyashTi 38750 

talirchu lata suM-darammu pRthivI-talammaMdu nE@M
dalaMtu ninu nO - dayArdra hRdayA - dahiMchen gadA  
kalaMgu yedapai@M - garammu liDa rA - kaTAxammulan 
veluMguko~rakai - priyA nilichitin - vishAdammutO 

sushupti vadalen - sumammu lalaren - suvarNammulan 
dushAra sara mA - dukUlamulapai - druTin Soebhilen 
ushOdayamulO - nushAMSuvulatO - horaMgul Chavul 
vishAda mikapai - veluMgu valalO - vilInammagun 

prAsa yatitO - 

sarasvati yanan - svarAlu kadalen - sarALammugA 
viriMchi taruNI - virANmukhi sudhA - sarittai yiTan 
hariMchu vetalan - karAMjalu livE - virAjilluchun 
dharAsthalini saM-hariMchu veDagun - smariMtun sadA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: