[racchabanda] మంజుభాషిణీ #maMjubhAshiNI#

 

మంజుభాషిణీ - 

విషమవృత్తము ఉద్గతలోని నాలుగవ పాదము, పాదమునకు 13 అక్షరాలు ఉండే అతిజగతి ఛందములోని 2796వ వృత్తమునకు సరిపోతుంది. దీనికి ఎన్నో పేరులు ఉన్నాయి. అవి - మంజుభాషిణీ, కనకప్రభా, నందినీ, జయా, ప్రబోధితా, మనోవతి, విలంబితా, సునందినీ, సుమంగలీ. సంస్కృతములో దీనికి యతి లేదు. తెలుగులో 9వ అక్షరమును యతి స్థానముగా నిర్ణయించినారు. నాకేమో ఏడవ అక్షరము యతి స్థానముగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు పాదము IIUIUI - IIUIUI Uగా విఱుగుతుంది. శ్రీవేంకటేశ్వర సుప్రభాతములోని క్రింది పద్యము ఈ వృత్తమే - 

తవసుప్రభాత మరవిందలోచనే 
భవతు ప్రసన్న ముఖచంద్రమండలే 
విధిశంకరేంద్ర వనితాభి రర్చితే 
వృషశైలనాథ దయితే దయానిధే 

క్రింద నా ఉదాహరణములు -

మంజుభాషిణీ - స/జ/స/జ/గ IIUIUI - IIUIUIU
13 అతిజగతి 2796 

మరుభూమిలోన - మధురావనమ్ములా 
శిరమెత్తి చూడ - సికతమ్మె దిక్కులన్ 
దరి గానరాదు - దరిసించ నెక్కడన్ 
దెరు వింక నాకుఁ - దిరునామమే కదా! 

సురలోక మేల - స్ఫురదిందురూపిణీ 
స్వరరాశి నీవు - వరమంజుభాషిణీ 
అరుదెంచు వేగ - మరవిందలోచనీ 
వర మిమ్ము నాకు - భవపాపమోచనీ 

కనకప్రభల్ వి-కసనమ్ము నొందఁగా 
వనజవ్రజమ్ము - ప్రసవించెఁ గొల్నులోఁ 
దనరారుచుండెఁ - దరులందుఁ బుష్పముల్ 
వినఁ దేనెలూరెఁ - బికరాగ గీతికల్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
maMjubhAshiNI - 

vishamavRttamu udgatalOni nAlugava pAdamu, pAdamunaku 13 axarAlu uMDE atijagati ChaMdamulOni 2796va vRttamunaku saripOtuMdi. dIniki ennO pErulu unnAyi. avi - maMjubhAshiNI, kanakaprabhA, naMdinI, jayA, prabOdhitA, manOvati, vilaMbitA, sunaMdinI, sumaMgalI. saMskRtamulO dIniki yati lEdu. telugulO 9va axaramunu yati sthAnamugA nirNayiMchinAru. nAkEmO EDava axaramu yati sthAnamugA uMTE bAguMTuMdi anipistuMdi. appuDu pAdamu #IIUIUI - IIUIUI U#gA vi~rugutuMdi. SrIvEMkaTESvara suprabhAtamulOni kriMdi padyamu ee vRttamE - 

tavasuprabhaata maraviMdalOchanE 
bhavatu prasanna mukhachaMdramaMDalE 
vidhiSaMkarEMdra vanitAbhi rarchitE 
vRshaSailanAtha dayitE dayAnidhE 

kriMda nA udAharaNamulu -

maMjubhAshiNI - sa/ja/sa/ja/ga #IIUIUI - IIUIUIU#
13 atijagati 2796 

marubhUmilOna - madhurAvanammulA 
Sirametti chUDa - sikatamme dikkulan 
dari gAnarAdu - darisiMcha nekkaDan 
deru viMka nAku@M - dirunAmamE kadA! 

suralOka mEla - sphuradiMdurUpiNI 
svararASi nIvu - varamaMjubhAshiNI 
arudeMchu vEga - maraviMdalOchanI 
vara mimmu nAku - bhavapApamOchanI 

kanakaprabhal vi-kasanammu noMda@MgA 
vanajavrajammu - prasaviMche@M golnulO@M 
danarAruchuMDe@M - darulaMdu@M bushpamul 
vina@M dEnelUre@M - bikarAga gItikal 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: