[racchabanda] నర్మిలి #narmili#

 

నర్మిలి - 

ఆధారము - కల్పితము 
సరసాల మేడ వృత్తము ఒక "రకమైన" వృత్తపు మొదటి రెండు పాదముల అమరిక అని నిన్న వివరించినాను. అదే వృత్తపు మూడవ నాలుగవ పాదముల అమరికయే "నర్మిలి" అనే ఈ తాళ వృత్తము. దీనిని కూడ చక్కగా పాడుకొన వీలగును. 

నర్మిలి - భ/న/జ/జ/జ/భ/జ/ర
UII IIII - UII UII - UIUIII - UIUIU
24 సంకృతి 5725055 

నవ్వుల కిలకిల - నర్మిలి నాదము - నన్ను నీదరికి - నాతి పిల్వఁగా 
గువ్వల గుసగుస - కొమ్మల సవ్వడి - కోమలీ వినుము - కూర్మి నిండఁగాఁ 
బువ్వుల మిసమిస - మోదపు గుర్తులు - పుష్పబాణుఁడటఁ - బొంచి చూచెనా 
మువ్వల గలగల - ముంచెను నన్నిట - మోహసింధు వది - పొంగి లేచెనా 

వాన చిటపటలు - పల్లవి యయ్యెను - వర్షకాలమున - వంత నింపఁగా 
నీనగవుల సిరి - నిండెను నామది - నెమ్మి పారె నిట - నిర్మలమ్ముగా 
నాననమును గన - నందముఁ జూడఁగ - నౌనొ కాదొ మఱి - యాస దీరునో 
ప్రాణము నిలిచెను - భారము హెచ్చెను - బాల ముంచెదవొ - వారి ముంచెదో 

ప్రాసయతితో - 

మల్లెల సరములు - తెల్లని కాన్కలు - ఫుల్లమై హృదియుఁ - బల్లవించఁగాఁ  
ద్రుళ్లుచు లేచెను - వెల్లువ సంతస - ముల్లసిల్లె మది - మెల్లమెల్లఁగాఁ  
జల్లని రేతిరి - జిల్లున గాలియుఁ - వెల్లఁగా నెలయు - జల్లెఁ గప్పురం 
బెల్లెడ నిండెను - బెల్లున గందము - వల్లకీక్వణము - లల్ల రాగముల్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
narmili - 

aadhAramu - kalpitamu 
sarasAla mEDa vRttamu oka "rakamaina" vRttapu modaTi reMDu pAdamula amarika ani ninna vivariMchinaanu. adE vRttapu mUDava nAlugava pAdamula amarikayE "narmili" anE ee tALa vRttamu. dInini kUDa chakkagA pADukona vIlagunu. 

narmili - bha/na/ja/ja/ja/bha/ja/ra
#UII IIII - UII UII - UIUIII - UIUIU#
24 saMkRti 5725055 

navvula kilakila - narmili nAdamu - nannu nIdariki - nAti pilva@MgA 
guvvala gusagusa - kommala savvaDi - kOmalI vinumu - kUrmi niMDa@MgA@M 
buvvula misamisa - mOdapu gurtulu - pushpabANu@MDaTa@M - boMchi chUchenA 
muvvala galagala - muMchenu nanniTa - mOhasiMdhu vadi - poMgi lEchenA 

vAna chiTapaTalu - pallavi yayyenu - varshakAlamuna - vaMta niMpa@MgA 
nInagavula siri - niMDenu nAmadi - nemmi pAre niTa - nirmalammugA 
nAnanamunu gana - naMdamu@M jUDa@Mga - nauno kAdo ma~ri - yAsa dIrunO 
prANamu nilichenu - bhAramu hechchenu - bAla muMchedavo - vAri muMchedO 

prAsayatitO - 

mallela saramulu - tellani kAn&kalu - phullamai hRdiyu@M - ballaviMcha@MgA@M  
druLluchu lEchenu - velluva saMtasa - mullasille madi - mellamella@MgA@M  
jallani rEtiri - jilluna gAliyu@M - vella@MgA nelayu - jalle@M gappuraM 
belleDa niMDenu - belluna gaMdamu - vallakIkvaNamu - lalla rAgamul 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: