[racchabanda] నవహర్ష #navaharsha#

 

నవహర్ష - 

ఆధారము - కాకవిన్ ఛందస్సు 
నడక - చతుర్మత్రల లేక షణ్మాత్రల గతి 

నవహర్ష - స/స/న/న/భ/భ/గ 
19 అతిధృతి 225244 

IIU IIU IIII - IIU IIU IIU విఱుపుతో 

మదిలో నిను నే వలఁచితి - మధుర స్వరముల్ వినఁగా 
వ్యధలో నిను నే దలఁచితి - వరదా త్వరగా దరి రా   
నదిలోఁ బడవన్ విడిచితి - నయమై పయన మ్మగునో 
సుధయో విసమో యెఱుఁగను - సుఖమో యిడుమో యిఁకపై 

కలయో నిజమో తెలియదు - కమనీయము నా తలఁపే 
యలగా మదిలో నెగసెను - హరుస మ్మది నా వలపా 
తెలిగా దివియల్ వెలుఁగఁగఁ - దెరువుల్ సరళమ్ములుగా 
చెలి యీ రజనీ కరములు - సిరియో విరియో వరమో 

IIUII UIIII - IIUII UIIU విఱుపుతో 

నవవర్షము సుందరమగు - నవహర్షము నిచ్చునుగా 
నవరాగము మానసమున - నయగారము దెచ్చునుగా 
నవగీతిక వీనుల నొక - నవనాదము మీటునుగా 
నవలామణి ముందు నిలువ - నవ మీజగ మయ్యెనుగా 

సరసమ్ముగ ముద్దిడఁగను - సరసా నను జూడఁగ రా 
హరుసమ్మున ముంచఁగ నను - నరసా కడు వేగమె రా 
కరమందున నీ కరమిడి - కవనమ్మును బాడఁగ రా 
విరబూసిన యీవిరులను - బ్రియమారఁగ నీయఁగ రా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
navaharsha - 

aadhAramu - kAkavin ChaMdassu 
naDaka - chaturmatrala lEka shaNmAtrala gati 

navaharsha - sa/sa/na/na/bha/bha/ga 
19 atidhRti 225244 

#IIU IIU IIII - IIU IIU IIU# vi~ruputO 

madilO ninu nE vala@Mchiti - madhura svaramul vina@MgA 
vyadhalO ninu nE dala@Mchiti - varadA tvaragA dari rA   
nadilO@M baDavan viDichiti - nayamai payana mmagunO 
sudhayO visamO ye~ru@Mganu - sukhamO yiDumO yi@Mkapai 

kalayO nijamO teliyadu - kamanIyamu nA tala@MpE 
yalagA madilO negasenu - harusa mmadi nA valapA 
teligA diviyal velu@Mga@Mga@M - deruvul saraLammulugA 
cheli yI rajanI karamulu - siriyO viriyO varamO 

#IIUII UIIII - IIUII UIIU# vi~ruputO 

navavarshamu suMdaramagu - navaharshamu nichchunugA 
navarAgamu mAnasamuna - nayagAramu dechchunugA 
navagItika vInula noka - navanAdamu mITunugA 
navalAmaNi muMdu niluva - nava mIjaga mayyenugA 

sarasammuga muddiDa@Mganu - sarasA nanu jUDa@Mga rA 
harusammuna muMcha@Mga nanu - narasA kaDu vEgame rA 
karamaMduna nI karamiDi - kavanammunu bADa@Mga rA 
virabUsina yIvirulanu - briyamAra@Mga nIya@Mga rA

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: