పరివాసము -
ఆధారము - కల్పితము
నడక - ఖండగతి
స్ఫూర్తి - నడిరేయి ఏ జాములో - స్వామి - నిను జేర దిగి వచ్చునో
పాదములోని గణములు - స/న/ర - న - స/న/ర
అనగా IIUI IIUIU - III - IIUI IIUIU
ఇందులో మధ్య ఉండే న-గణము ఒకే గణస్వరూపము గల రెండు అమరికలను వంతెనగా కలుపుతుంది. ఇట్టి వంతెనను "వరణము" అనుట వాడుక. పరివాసము అంటే పరిమళము. వంతెన ఒక ప్రత్యేక పదము అయితే, దానిని లేకుండ కూడ పాడుకొన వచ్చును. రెండు సమ భాగములకు ప్రాసయతి, వంతెనలోని మొదటి అక్షరమునకు అక్షరసామ్య యతి.
పరివాసము - స/న/ర/న/స/న/ర IIUI IIUIU - III -IIUI IIUIU
21 ప్రకృతి 769724
కలఁ గంటి నడిరేయిలోఁ - గలికి -
చెలువమ్ము నను లేపెనో
లలితోడ నను జూడు నా - లలన -
వలపందు నను దేల్చునో
తలపించు కవనమ్ముగాఁ - దరుణి -
మలవోలె నను గాయునో
పులకించ ముదమీయుఁగా - ముదిత -
చిలికించు నమృతమ్మునో
సరసాల జవరాల రా - సరస -
సరదాలు చెలువారఁగా
స్వర రాగసుధతోడ రా - ప్రణయ -
వరగీతి నుడువంగ రా
చిఱుహాసములతోడ రా - చెలియ -
సిరివెన్నెలలఁ జల్ల రా
మఱపించి మురిపించ రా - మగువ -
మఱునాఁడు మనకేలనే
శరణంటిఁ గడు భక్తితో - జనని -
చరణమ్ములను దాఁకుచున్
వరవీణ మెల మ్రోఁగఁగా - స్వరపు -
పరివాసములు నిండెఁగా
దరహాసముల పుష్పముల్ - ద్వరగ -
ధరపైన నిఁక రాలునో
సరసీజదళనేత్రి నా - సవర -
స్వరమందు శ్రుతి సేయునో
ఉదాహరణముగా చివరి పద్యమును వంతెన లేకుండ వ్రాస్తే కూడ పాడుకొన వచ్చును. అప్పుడు అది పాదమునకు 9 అక్షరములు గల బృహతి ఛందములోని 188వ వృత్తము అవుతుంది.
స/న/ర IIUI IIUIU
9 బృహతి 188
శరణంటిఁ గడు భక్తితో
చరణమ్ములను దాఁకుచున్
వరవీణ మెల మ్రోఁగఁగా
పరివాసములు నిండెఁగా
దరహాసముల పుష్పముల్
ధరపైన నిఁక రాలునో
సరసీజదళనేత్రి నా
స్వరమందు శ్రుతి సేయునో
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
parivAsamu -
aadhaaramu - kalpitamu
naDaka - khaMDagati
sphUrti -
naDirEyi E jAmulO - svAmi - ninu jEra digi vachchunO
pAdamulOni gaNamulu - sa/na/ra - na - sa/na/ra
anagA #IIUI IIUIU - III - IIUI IIUIU#
iMdulO madhya uMDE na-gaNamu okE gaNasvarUpamu gala reMDu amarikalanu vaMtenagA kaluputuMdi. iTTi vaMtenanu "varaNamu" anuTa vADuka. parivAsamu aMTE parimaLamu. vaMtena oka pratyEka padamu ayitE, dAnini lEkuMDa kUDa pADukona vachchunu. reMDu sama bhAgamulaku prAsayati, vaMtenalOni modaTi axaramunaku axarasAmya yati.
parivAsamu - sa/na/ra/na/sa/na/ra #IIUI IIUIU - III -IIUI IIUIU#
21 prakRti 769724
kala@M gaMTi naDirEyilO@M - galiki -
cheluvammu nanu lEpenO
lalitODa nanu jUDu nA - lalana -
valapaMdu nanu dElchunO
talapiMchu kavanammugA@M - daruNi -
malavOle nanu gAyunO
pulakiMcha mudamIyu@MgA - mudita -
chilikiMchu namRtammunO
sarasAla javarAla rA - sarasa -
saradAlu cheluvAra@MgA
svara rAgasudhatODa rA - praNaya -
varagIti nuDuvaMga rA
chi~ruhAsamulatODa rA - cheliya -
sirivennelala@M jalla rA
ma~rapiMchi muripiMcha rA - maguva -
ma~runA@MDu manakElanE
SaraNaMTi@M gaDu bhaktitO - janani -
charaNammulanu dA@Mkuchun
varavINa mela mrO@Mga@MgA - svarapu -
parivAsamulu niMDe@MgA
darahAsamula pushpamul - dvaraga -
dharapaina ni@Mka rAlunO
sarasIjadaLanEtri nA - savara -
svaramaMdu Sruti sEyunO
udAharaNamugA chivari padyamunu vaMtena lEkuMDa vrAstE kUDa pADukona vachchunu. appuDu adi pAdamunaku 9 axaramulu gala bRhati ChaMdamulOni 188va vRttamu avutuMdi.
sa/na/ra #IIUI IIUIU#
9 bRhati 188
SaraNaMTi@M gaDu bhaktitO
charaNammulanu dA@Mkuchun
varavINa mela mrO@Mga@MgA
parivAsamulu niMDe@MgA
darahAsamula pushpamul
dharapaina ni@Mka rAlunO
sarasIjadaLanEtri nA
svaramaMdu Sruti sEyunO
vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#
__._,_.___
Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.
To Post a message, send it to: racchabanda@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
.
__,_._,___
No comments:
Post a Comment