[racchabanda] సమదవిలాసినీ #samadavilAsinI#

 

సమదవిలాసినీ - 

ఆధారము - జయదామన్ 
ఇతర నామములు - విలాసినీ, విశ్వలలిత (కాకవిన్)
వేళంకర్ వృత్తరత్నాకరములో ఈ వృత్తము చెప్పబడినది అన్నారు, కాని నా వృ.ర. ప్రతిలో ఇది కనబడలేదు. 
సంస్కృతములో పాదము 12,5 గా విఱుగుతుంది. నేను చంపకమాలవలె యతిని ఉంచినాను. 

సమదవిలాసినీ (విలాసినీ, విశ్వలలిత) - న/జ/భ/జ/భ/లగ 
IIII UIU III - UI UI IIU 
17 అత్యష్టి 60336 

సలలిత రాగరాగిణుల - సంతతమ్ము వినఁగా 
వెలిఁగెను నాదు మానసము - ప్రేమదీప రుచులన్ 
దెలియని మోదమొండు నను - దీయఁగాను మునిచెన్ 
జెలువములోన దైవమును - జేరఁ గంటిని సకీ 

సమదవిలాసినిన్ గనఁగ - సంతసమ్ము గలిగెన్ 
రమణను లేచెఁ బొంగులిడి - రాగరత్న జలధుల్   
సుమముల వర్ణజాలముల - సోయగమ్ము లలరెన్ 
గమలదళేక్షణా యిదియె - కామవల్లభముగా 

మధురము చంద్రరశ్మి యిట - మాధవా కనఁగ రా 
మధురము ప్రేమ రాగములు - మాధవా వినఁగ రా 
మధురము మందమారుతము - మాధవా దరిని రా 
మధురము రాత్రి రమ్యతయు - మాధవా పలుక రా 

రుచిరసుగంధ బంధురము - రోచమాన ఘడియల్ 
విచికిల మెందు జూడఁ గడు - వింత వాసనలతో 
రచనలు ప్రేమపూర్ణమవ - రమ్ము విశ్వలలిత 
మ్మచలము నీదు నాదు ముడి - యాశ మొగ్గ విరియన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
samadavilAsinI - 

aadhAramu - jayadAman 
itara nAmamulu - vilAsinI, viSvalalita (kAkavin)
vELaMkar vRttaratnAkaramulO ee vRttamu cheppabaDinadi annAru, kAni nA vR.ra. pratilO idi kanabaDalEdu. 
saMskRtamulO pAdamu 12,5 gA vi~rugutuMdi. nEnu chaMpakamAlavale yatini uMchinAnu. 

samadavilAsinI (vilAsinI, viSvalalita) - na/ja/bha/ja/bha/laga 
#IIII UIU III - UI UI IIU# 
17 atyashTi 60336 

salalita rAgarAgiNula - saMtatammu vina@MgA 
veli@Mgenu nAdu mAnasamu - prEmadIpa ruchulan 
deliyani mOdamoMDu nanu - dIya@MgAnu munichen 
jeluvamulOna daivamunu - jEra@M gaMTini sakI 

samadavilAsinin gana@Mga - samtasammu galigen 
ramaNanu lEche@M boMguliDi - rAgaratna jaladhul   
sumamula varNajAlamula - sOyagammu lalaren 
gamaladaLExaNA yidiye - kAmavallabhamugA 

madhuramu chaMdraraSmi yiTa - mAdhavA kana@Mga rA 
madhuramu prEma rAgamulu - mAdhavA vina@Mga rA 
madhuramu maMdamArutamu - mAdhavA darini rA 
madhuramu rAtri ramyatayu - mAdhavA paluka rA 

ruchirasugaMdha baMdhuramu - rOchamAna ghaDiyal 
vichikila meMdu jUDa@M gaDu - viMta vAsanalatO 
rachanalu prEmapUrNamava - rammu viSvalalita 
mmachalamu nIdu nAdu muDi - yASa mogga viriyan 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: