[racchabanda] సరసాల మేడ #sarasAla mEDa#

 

సరసాల మేడ - 

ఆధారము - కల్పితము 
ఇది ఒక రకమైన వృత్తములోని మొదటి రెండు పాదములు చేర్చగా లభించినది. అదేదో మీరు ఊహించండి! 

నిజముగా ఇది ఒక అందమైన తాళవృత్తము, చక్కగా పాడుకోవచ్చును! 

సరసాల మేడ - స/జ/స/న/స/జ/గ IIUIUI - IIUIIII - IIUIUI U
19 అతిధృతి 179948

మనసేల నిన్ను - మఱి నేఁడు తలఁచె - మధురానుభూతితో 
ప్రణయమ్ము నిండు - పదమొండు వినఁగ - వడి లేచు నాశతో 
తనువెల్ల నీదు - తపనాగ్ని ఛటలు - దహియించుచుండెనే 
కనరమ్ము రమ్య - కలహంస నటన - కనిపించ వేగమే 

ప్రాసయతితో - 

సరసాల మేడఁ - దరుణేందురుచులు - కురిపించు కాంతిలో 
హరుసాల రేయి - విరజాజి విరులు - హరిచందనమ్ముతో 
చిఱుగాలి వీచఁ - జిఱునవ్వు లలర - మురిపించ నో చెలీ 
దరి రమ్ము పొంద - సురసీమ సుగము - నిరతమ్ము నిండుగా 

ఇలపైన నాకుఁ - గల యొక్క వరము - తిలకించ నిన్ను నేఁ 
బులకింతు నెంతొ - చెలి నీవు ముదముఁ - జిలికించు జల్లుగా 
కలవేణురావ - మలరించ హృదిని - మెలమెల్ల పాడనా 
వలపొక్క కాన్క - వలరాయఁ డొసఁగు - లలితోడ నాడనా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sarasAla mEDa - 

aadhAramu - kalpitamu 
idi oka rakamaina vRttamulOni modaTi reMDu pAdamulu chErchagA labhiMchinadi. adEdO mIru oohiMchaMDi! 

nijamugA idi oka aMdamaina tALavRttamu, chakkagA pADukOvachchunu! 

sarasAla mEDa - sa/ja/sa/na/sa/ja/ga #IIUIUI - IIUIIII - IIUIUI U#
19 atidhRti 179948

manasEla ninnu - ma~ri nE@MDu tala@Mche - madhurAnubhUtitO 
praNayammu niMDu - padamoMDu vina@Mga - vaDi lEchu nASatO 
tanuvella nIdu - tapanAgni ChaTalu - dahiyiMchuchuMDenE 
kanarammu ramya - kalahaMsa naTana - kanipiMcha vaegamE 

prAsayatitO - 

sarasAla mEDa@M - daruNEMduruchulu - kuripiMchu kAMtilO 
harusAla rEyi - virajAji virulu - harichaMdanammutO 
chi~rugAli vIcha@M - ji~runavvu lalara - muripiMcha nO chelI 
dari rammu poMda - surasIma sugamu - niratammu niMDugA 

ilapaina nAku@M - gala yokka varamu - tilakiMcha ninnu nE@M 
bulakiMtu neMto - cheli nIvu mudamu@M - jilikiMchu jallugA 
kalavENurAva - malariMcha hRdini - melamella pADanA 
valapokka kAn&ka - valarAya@M Dosa@Mgu - lalitODa nADanA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: