[racchabanda] ఉద్గతా భేదము లలిత #udgatA bhEdamu lalita#

 

ఉద్గతా భేదము లలిత - 

ఉద్గతలోని మూడవ పాదమునకు గణములు న/న/స/స అయితే అది లలిత అవుతుంది. 

UIII III UIIU - ఉద్గత
IIIIIIII UIIU - లలిత

పాదము 1 - స/జ/స/ల IIUIUI IIUI
పాదము 2 - న/స/జ/గ III IIUIUI U
పాదము 3 - న/న/స/స IIIIIIII UIIU
పాదము 4 - స/జ/స/జ/గ II UIUIII UIUIU

లలితమ్ము రూపు లలితాంగి 
లలితముగ లాస్య మాడుమా 
గళమున స్వరములు గానములా 
శిలవోలె నుంటి నిటఁ జేర రా సకీ 

విరహమ్మునందు విరులేల 
కరువలియుఁ గష్టమయ్యెనే 
చెరువగు కనులకుఁ జెల్వములా 
చిఱునవ్వు లీమనికిఁ జిందు నెప్పుడో

క్రింద రెండు రెండు పాదములు లయబద్ధముగా వ్రాయబడినవి. మొదటి రెండు పాదములలో ప్రాసయతి, చివరి రెండు పాదములలో అక్షరసామ్య యతి. 

మనసెందు కిందు నిను జూతు 
ననెను నునుసందె వేళలో 
నినుఁ డరుణ కళిక యింపులతోఁ  
గన నీయ మోదమును హృద్యమై సఖీ 

మనసెందు కిందు 
నిను జూతు ననెను 
నునుసందె వేళలో 
నినుఁ డరుణ కళిక 
యింపులతోఁ గన 
నీయ మోదమును 
హృద్యమై సఖీ 

కలలోన వచ్చి పలికించు 
మలర నళినాక్షి వేగమే 
పులకలిడు మనసు మోదపు టు-
య్యెల ముందురా సకియ మోహనమ్ముగా 

కలలోన వచ్చి 
పలికించు మలర 
నళినాక్షి వేగమే 
పులకలిడు మనసు 
మోదపు టుయ్యెల 
ముందురా సకియ 
మోహనమ్ముగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
udgatA bhEdamu lalita - 

udgatalOni mUDava pAdamunaku gaNamulu na/na/sa/sa ayitE adi lalita avutuMdi. 

#UIII III UIIU# - udgata
#IIIIIIII UIIU# - lalita

pAdamu 1 - sa/ja/sa/la #IIUIUI IIUI#
pAdamu 2 - na/sa/ja/ga #III IIUIUI U#
pAdamu 3 - na/na/sa/sa #IIIIIIII UIIU#
pAdamu 4 - sa/ja/sa/ja/ga #II UIUIII UIUIU#

lalitammu rUpu lalitAMgi 
lalitamuga lAsya mADumA 
gaLamuna svaramulu gAnamulA 
SilavOle nuMTi niTa@M jEra rA sakI 

virahammunaMdu virulEla 
karuvaliyu@M gashTamayyenE 
cheruvagu kanulaku@M jelvamulA 
chi~runavvu lImaniki@M jiMdu neppuDO

kriMda reMDu reMDu pAdamulu layabaddhamugA vrAyabaDinavi. modaTi reMDu pAdamulalO prAsayati, chivari reMDu pAdamulalO axarasAmya yati. 

manaseMdu kiMdu ninu jUtu 
nanenu nunusaMde vELalO 
ninu@M DaruNa kaLika yiMpulatO@M  
gana nIya mOdamunu hRdyamai sakhI 

manaseMdu kiMdu 
ninu jUtu nanenu 
nunusaMde vELalO 
ninu@M DaruNa kaLika 
yiMpulatO@M gana 
nIya mOdamunu 
hRdyamai sakhI 

kalalOna vachchi palikiMchu 
malara naLinAxi vEgamE 
pulakaliDu manasu mOdapu Tu-
yyela muMdurA sakiya mOhanammugA 

kalalOna vachchi 
palikiMchu malara 
naLinAxi vEgamE 
pulakaliDu manasu 
mOdapu Tuyyela 
muMdurA sakiya 
mOhanammugA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: