[racchabanda] ఉద్గత యందలి మూడవ పాదము - చిఱుదీవియ #udgata yaMdali mUDava pAdamu - chi~rudIviya#

 

ఉద్గత యందలి మూడవ పాదము - చిఱుదీవియ 

ఆధారము - కల్పితము 
యతి ఆఱవ అక్షరము, ప్రాసయతి ఎనిమిదవ అక్షరము (తొమ్మిదవ అక్షరము ప్రాసాక్షరము)

చిఱుదీవియ - భ/న/జ/లగ - UIIII - II - UIIU
11 త్రిష్టుప్పు 895 

మానసమున మను కాననముల్ 
కాననమునఁ గనఁ బ్రాణతతుల్ 
ప్రాణతతులఁ బలు యేనుఁగు లా 
యేనుఁగు లిడు నిఁక ధ్వానములన్ 

వాదనముల వల వేదనలే 
కాదనకుము కల మోదములే 
నాదగు లలి నది నీఁదుదమా 
సాదరముగ సకి నాదరి రా

నావలపుకు నవ రావములా 
రావములకు రస భావములా 
భావములకుఁ బలు జీవములా 
జీవములనఁ జిఱు దీవియలా 

కామధనువుఁ గను కామమయీ 
ప్రేమ మలరెఁ బ్రియ నామదిలో 
సోమరసము సుధ లీమహిలో 
నోమధుమతి యొగి నీమదిలో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
udgata yaMdali mUDava pAdamu - chi~rudIviya 

aadhAramu - kalpitamu 
yati aa~rava axaramu, prAsayati enimidava axaramu (tommidava axaramu prAsAxaramu)

chi~rudIviya - bha/na/ja/laga - #UIIII - II - UIIU#
11 trishTuppu 895 

mAnasamuna manu kAnanamul 
kAnanamuna@M gana@m brANatatul 
prANatatula@M balu yEnu@Mgu lA 
yEnu@Mgu liDu ni@Mka dhvAnamulan 

vAdanamula vala vEdanalE 
kAdanakumu kala mOdamulE 
nAdagu lali nadi nI@MdudamA 
sAdaramuga saki nAdari rA

nAvalapuku nava rAvamulA 
rAvamulaku rasa bhAvamulA 
bhAvamulaku@M balu jIvamulA 
jIvamulana@M ji~ru dIviyalA 

kAmadhanuvu@M ganu kAmamayI 
prEma malare@M briya nAmadilO 
sOmarasamu sudha lImahilO 
nOmadhumati yogi nImadilO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: