[racchabanda] వనహరిణీ - జాతి పద్యము #vanahariNI - jAti padyamu#

 

వనహరిణీ - జాతి పద్యము 

ఆధారము - పట్వర్ధన్ ఛందోరచనా 
గతి - నాలుగు అష్టమాత్రలు

వనహరిణీ - 8 - 8 - 8 - 8 మాత్రలు

అక్షరసామ్య యతితో - 

వద్దు సునయనా - వనహరిణీ యుప-వనమున వేగమె - పారిపోకుమా 
ముద్దాడ రమ్ము - మోహనమ్ముగాఁ - బులకింతు నేను - ముదము పొంగఁగా 
సద్దు సేయనే - సరసర వెళ్లకు - చారు నేత్రముల - సాహినమా నా
యొద్దకు రావే - యుల్లమ్ము నిండ - నొక తృణము నిత్తు - నోకురంగమా 

సారసమ్ము లటఁ - జక్కని ధనువై - సాఁగుచుండె నా - చంద్రుఁ దాఁకఁగా 
నీరజమ్ము లిట - నీరమునందున - నేత్రపర్వమే - నిక్కి కదలఁగా
దూరపు కొండలఁ - దోయదమ్ము లొక - తోరణమై మనెఁ - దోయజాక్షి రా 
చేరి యాడుదము - చెలిమిఁ బాడుదము - చిత్రగీతముల - చెలి నాదరి రా 

ప్రాసయతితో - 

చందన చర్చిత - సుందర దేహా - విందు లీయు మా-నంద మురళితో 
చందురుఁ డాకస-మందుఁ బర్వులిడ - నిందు కిరణ మతి - సుందరతరమే 
స్యందన మెక్కి సు-గంధమయమ్మగు - గంధమాదనము - నందుకొనఁగ రా 
పందిరి నింగియు - వందల తారలు - చిందిడ వెల్గులు - సింధువయ్యెఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vanahariNI - jAti padyamu 

aadhAramu - paTvardhan ChaMdOrachanA 
gati - nAlugu ashTamAtralu

vanahariNI - 8 - 8 - 8 - 8 mAtralu

axarasAmya yatitO - 

vaddu sunayanA - vanahariNI yupa-vanamuna vEgame - pAripOkumA 
muddADa rammu - mOhanammugA@M - bulakiMtu nEnu - mudamu poMga@MgA 
saddu sEyanE - sarasara veLlaku - chAru nEtramula - sAhinamA nA
yoddaku rAvE - yullammu niMDa - noka tRNamu nittu - nOkuraMgamA 

sArasammu laTa@M - jakkani dhanuvai - sA@MguchuMDe nA - chaMdru@M dA@Mka@MgA 
nIrajammu liTa - nIramunaMduna - nEtraparvamE - nikki kadala@MgA
dUrapu koMDala@M - dOyadammu loka - tOraNamai mane@M - dOyajAxi rA 
chEri yADudamu - chelimi@M bADudamu - chitragItamula - cheli nAdari rA 

prAsayatitO - 

chaMdana charchita - suMdara dEhA - viMdu lIyu mA-naMda muraLitO 
chaMduru@M DAkasa-maMdu@M barvuliDa - niMdu kiraNa mati - suMdarataramE 
syaMdana mekki su-gaMdhamayammagu - gaMdhamAdanamu - naMdukona@Mga rA 
paMdiri niMgiyu - vaMdala tAralu - chiMdiDa velgulu - siMdhuvayye@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: