[racchabanda] విసర్జిత #visarjita#

 

విసర్జిత - 

ఆధారము - కాకవిన్ కవులు, ఈ వృత్తము సంస్కృత గ్రంథములలో కనబడలేదు. 

విసర్జిత - భ/భ/భ/న/జ/జ/లగ UII UII UII - IIII UII UIIU
20 కృతి 450487

సుందరి చూడుమ నన్నిట - సొబగిడు రంగుల కాంతులతోఁ  
జిందుము నవ్వుల వెన్నెల - సిరియగు నెప్పుడు నాకదియే 
సందియ మెందుకు నీకిఁక - సగమగు నద్దమ రేయి గదా 
ముందటి జన్మల బంధము - ముదమిడు మాయని పెన్నిధియే 

ప్రేమము ప్రేమము చేరిన - ప్రియ యది నిక్కము ప్రేమయెగా 
ప్రేమము ద్వేషము చేరిన - ప్రియ యది మారుచు నేమగునో  
ప్రేమము కామము చేరిన - ప్రియ యది ముద్దుల సంగమమే 
కామము కామము చేరిన - కరఁగును మైసిరి యందములే 

తీయని వెన్నెల రేతిరిఁ - దెనుఁగునఁ బాటలఁ బాదుదమా 
పాయని హాయినిఁ బొందఁగ - వలపునఁ సోలుచుఁ దేలుదమా 
కోయిల నాదముతోడను - గుతుకపు రావము నింపుదమా 
ప్రేయసి యిద్దర మిప్పుడు - ప్రియమగు ముద్దులఁ బొందుదమా   

రాశిగఁ బూవులఁ దెచ్చితి - రసమయ పూజకు నీకిపుడే 
మూసిన ద్వారముఁ దీసితి - ముదమిడు రంగుల వెల్తురుకై 
వ్రాసిన పద్యముఁ బాడితి - వరదుని ధ్యానము సల్పుటకై 
చేసిన పాపములోఁగల - చెడుగిఁక నేఁడు విసర్జితమా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
visarjita - 

aadhAramu - kAkavin kavulu, ee vRttamu saMskRta graMthamulalO kanabaDalEdu. 

visarjita - bha/bha/bha/na/ja/ja/laga #UII UII UII - IIII UII UIIU#
20 kRti 450487

suMdari chUDuma nanniTa - sobagiDu raMgula kAMtulatO@M  
jiMdumu navvula vennela - siriyagu neppuDu nAkadiyE 
saMdiya meMduku nIki@Mka - sagamagu naddama rEyi gadA 
muMdaTi janmala baMdhamu - mudamiDu mAyani pennidhiyE 

prEmamu prEmamu chErina - priya yadi nikkamu prEmayegA 
prEmamu dvEshamu chErina - priya yadi mAruchu nEmagunO  
prEmamu kAmamu chErina - priya yadi muddula saMgamamE 
kAmamu kAmamu chErina - kara@Mgunu maisiri yaMdamulE 

tIyani vennela rEtiri@M - denu@Mguna@M bATala@M bAdudamA 
pAyani hAyini@M boMda@Mga - valapuna@M sOluchu@M dEludamA 
kOyila nAdamutODanu - gutukapu rAvamu niMpudamA 
prEyasi yiddara mippuDu - priyamagu muddula@M boMdudamA   

rASiga@M bUvula@M dechchiti - rasamaya pUjaku nIkipuDE 
mUsina dvAramu@M dIsiti - mudamiDu raMgula velturukai 
vrAsina padyamu@M bADiti - varaduni dhyAnamu salpuTakai 
chEsina pApamulO@Mgala - cheDugi@Mka nE@MDu visarjitamA 

vidhEyuDu - jejjaala kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: