[racchabanda] ఆపాతళికాపరాంతికా #aapAtaLikAparAMtikA#

 

ఆపాతళికాపరాంతికా - 

ఇది ఒక చతుష్పది. ఇందులో అన్ని పాదములలో 8 మాత్రలు + భ/గగ ఉంటుంది. అనగా పాదమంతా చతుర్మాత్రామయము. 8 మాత్రలలో నాలుగుకన్న ఎక్కువ లఘువులు పక్కపక్కన ఉండరాదు. నా ఉదాహరణములు - 

ఆపాతళికాపరాంతిక - 8 మాత్రలు + భ/గగ

కనుమా నాయీ - కాటుక కన్నుల్ 
వినుమా నాయీ - వీణియ మ్రోఁతల్ 
నిను నేఁ బిల్చితి - నెమ్మియు నిండన్ 
మనమోహన రా - మాధురి నింపన్ 

కాముని పండుగ - కమ్మఁగ వచ్చెన్ 
సోముని వెన్నెల - సొంపుల నిచ్చెన్ 
యామిని వేళల - యందముఁ జూడన్ 
రా మధురమ్మగు - రాగముఁ బాడన్ 

వరవీణామృత - పానము నీకై 
హరి యిచ్చెదను ర-యమ్ముగ రారా 
స్వర మాధురు లవి - స్వర్గపు గంటల్ 
చరణమ్ముల సడి - చల్లని మంటల్ 

ఇందులో చివరి రెండు మాత్రాగణములు భ/గగ లతో ఎనిమిది చతుర్మాత్రలుగా 16 సాధ్యమైనా, అందులో మూడు ఈ మాత్రాసమక వృత్తమునకు సరిపోవు, ఎందుకనగా నాలుగు లఘువులకన్న ఎక్కువ లఘువులు పక్కపక్కన ఉండరాదు. సాధ్యములైన మొత్తము 13 పాదములలో 11 ఛందశ్శాస్త్రములో వృత్తములుగా పేర్కొనబడినవి. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aapAtaLikAparAMtikA - 

idi oka chatushpadi. iMdulO anni pAdamulalO 8 mAtralu + bha/gaga uMTuMdi. anagA pAdamaMtA chaturmAtrAmayamu. 8 mAtralalO nAlugukanna ekkuva laghuvulu pakkapakkana uMDarAdu. nA udAharaNamulu - 

aapAtaLikAparAMtika - 8 mAtralu + bha/gaga

kanumA nAyI - kATuka kannul 
vinumA nAyI - vINiya mrO@Mtal 
ninu nE@M bilchiti - nemmiyu niMDan 
manamOhana rA - mAdhuri niMpan 

kAmuni paMDuga - kamma@Mga vachchen 
sOmuni vennela - soMpula nichchen 
yAmini vELala - yaMdamu@M jUDan 
rA madhurammagu - rAgamu@M bADan 

varavINAmRta - pAnamu nIkai 
hari yichchedanu ra-yammuga rArA 
svara mAdhuru lavi - svargapu gaMTal 
charaNammula saDi - challani maMTal 

iMdulO chivari reMDu mAtrAgaNamulu bha/gaga latO enimidi chaturmAtralugA 16 sAdhyamainA, aMdulO mUDu ee mAtrAsamaka vRttamunaku saripOvu, eMdukanagA nAlugu laghuvulakanna ekkuva laghuvulu pakkapakkana uMDarAdu. sAdhyamulaina mottamu 13 pAdamulalO 11 ChaMdaSSAstramulO vRttamulugA pErkonabaDinavi. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: