[racchabanda] అర్ధసమ వృత్తము రవణము #ardhasama vRttamu ravaNamu#

 

అర్ధసమ వృత్తము రవణము - 

ఆధారము - కల్పితము; ఔపచ్ఛందసికయందలి ఒక ప్రత్యేకత యిది. 

  IIUII - UIUIUU - స/స/జ/గగ  - బేసి పాదములు 
IIIIUII - UIUIUU - న/జ/జ/ర/గ - సరి పాదములు 

రవణము - IIUII - UIUIUU // IIIIUII - UIUIUU 

సకి నీకది - జ్ఞాపకమ్ము లేదా 
రకముల సంధ్యయు - రాగరంగమయ్యెన్  
మొకమందున - మోహనమ్ముగా నా 
వికసిత సిందుర - వీచికల్ నృతించెన్ 

శశిబింబము - చక్కఁగా జనించన్ 
మిసమిసతో రవి - మెల్లఁగాఁ జనంగా 
కుసుమమ్ములు - కొల్లగా రమించన్ 
రసమయమౌ నిఁక - రాత్రివేళ రంగుల్ 

రెండు పాదములను చేర్చి వ్రాసినది - 

కవనమ్ముల - కాకలీస్వరమ్ముల్ / నవ 
భువనమ్ముల - మ్రోయుచుండుఁగాదా 
రవణమ్ములు - రాశిగా ధ్వనించున్ / నవ 
నవమై యవి - నాందిగాను వెల్గున్ 

అరవిందము - లందమై సుమించన్ / రవి 
కిరణమ్ముల - కెంపు లుజ్వలమ్ముల్ 
చిఱుగాలుల - చెమ్మ నన్ను దాఁకన్ / గురు 
వరమయ్యెను - బ్రాహ్మవేళ నాకున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu ravaNamu - 

aadhAramu - kalpitamu; aupachChaMdasikayaMdali oka pratyEkata yidi. 

#  IIUII - UIUIUU# - sa/sa/ja/gaga  - bEsi pAdamulu 
#IIIIUII - UIUIUU# - na/ja/ja/ra/ga - sari pAdamulu 

ravaNamu - #IIUII - UIUIUU // IIIIUII - UIUIUU# 

saki nIkadi - j~nApakammu lEdA 
rakamula saMdhyayu - rAgaraMgamayyen  
mokamaMduna - mOhanammugA nA 
vikasita siMdura - vIchikal nRtiMchen 

SaSibiMbamu - chakka@MgA janiMchan 
misamisatO ravi - mella@MgA@M janaMgA 
kusumammulu - kollagA ramiMchan 
rasamayamau ni@Mka - rAtrivELa raMgul 

reMDu pAdamulanu chErchi vrAsinadi - 

kavanammula - kAkalIsvarammul / nava 
bhuvanammula - mrOyuchuMDu@MgAdA 
ravaNammulu - rASigA dhvaniMchun / nava 
navamai yavi - nAMdigAnu velgun 

araviMdamu - laMdamai sumiMchan / ravi 
kiraNammula - keMpu lujvalammul 
chi~rugAlula - chemma nannu dA@Mkan / guru 
varamayyenu - brAhmavELa nAkun 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: