[racchabanda] అర్ధసమ వృత్తము - శ్రుతకీర్తి #ardhasama vRttamu - SrutakIrti#

 

అర్ధసమ వృత్తము - శ్రుతకీర్తి 

ఆధారము - ఛందోరచనా 
ఇది మాత్రావృత్తమైన ప్రాచ్యవృత్తియొక్క ఒక ప్రత్యేకత. ప్రాచ్యవృత్తికి బేసి పాదములలో 6 మాత్రలు + ర/లగ, సరి పాదములలో 3 మాత్రలు + గురువు + 3 మాత్రలు + ర/లగ. శ్రుతకీర్తిలోని సరి పాదములు రథోద్ధతకు సరిపోతాయి. క్రింద నా ఉదాహరణములు -  

శ్రుతకీర్తి - త/జ/ర // ర/న/ర/లగ UUII - UIUIU // UIUIII - UIUIU 

కించల్ శ్రుత-కీర్తి యెందుకే 
యించుకైన నిడు - మేల చెల్లెలా 
కాంచన్ ద్వరఁ - గాననమ్ము వ- 
ర్జించి వత్తు మిదె - చెల్లి ప్రేమతో 

ఆనందము - నంద మిచ్చునా 
గాన సుస్వరము - గంగ యూర్మికా 
యీనాఁడిఁక - యెప్పుడుండదా 
నేనులేనియెడ - నీవు నీవెగా 

సౌందర్యపు - ఛందమేమియో 
మందవాహినుల - మత్స్యలాస్యమా  
నందీశ్వరు - నవ్య తాళమా 
వంద పూల నవ - వర్ణమాలలా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu - SrutakIrti 

aadhAramu - ChaMdOrachanA 
idi mAtrAvRttamaina prAchyavRttiyokka oka pratyEkata. prAchyavRttiki bEsi pAdamulalO 6 mAtralu + ra/laga, sari pAdamulalO 3 mAtralu + guruvu + 3 mAtralu + ra/laga. SrutakIrtilOni sari pAdamulu rathOddhataku saripOtAyi. kriMda nA udAharaNamulu -  

SrutakIrti - ta/ja/ra // ra/na/ra/laga #UUII - UIUIU // UIUIII - UIUIU# 

kiMchal Sruta-kIrti yeMdukE 
yiMchukaina niDu - mEla chellelA 
kAMchan dvara@M - gAnanammu va- 
rjiMchi vattu mide - chelli prEmatO 

aanaMdamu - naMda michchunA 
gAna susvaramu - gaMga yUrmikA 
yInA@MDi@Mka - yeppuDuMDadA 
nEnulEniyeDa - nIvu nIvegA 

sauMdaryapu - ChaMdamEmiyO 
maMdavAhinula - matsyalAsyamA  
naMdISvaru - navya tALamA 
vaMda pUla nava - varNamAlalA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: