[racchabanda] అర్ధసమ వృత్తము వైసారీ #ardhasama vRttamu vaisArI#

 

అర్ధసమ వృత్తము వైసారీ - 

ఆధారము - వాగ్వల్లభ 
వైతాళీయపు ఒక ప్రత్యేకత యిది. 
 UUII - UIUIU - త/జ/ర    - బేసి పాదములు
UUUII - UIUIU - మ/స/జ/గ - సరి పాదములు

వైసారిన్ అంటే సంస్కృతములో చేప. 

వైసారీ - త/జ/ర // మ/స/జ/గ 
UUII - UIUIU // U UUII - UIUIU 

నీకోసమె - నేను వేచితిన్ 
రాకాచంద్రుని - రాక యెప్పుడో 
నాకామిని - నన్ను గాంచునా 
నాకమ్మిప్పుడు - నాకుఁ జూపునా 

ఆలోచన-లందు నీవెగా 
నాలోలమ్మగు - యామినిన్ సకా 
తేలెన్ శశి - తెల్ల వెల్గులో 
కాలమ్మయ్యెను - గాచియుంటి నేన్ 

రెండు పాదములను చేర్చినప్పుడు - 

వర్ణమ్ములు - భ్రాంతిఁ గొల్పఁగా / నా 
స్వర్ణమ్ముల - సంధ్య వేళలో 
కర్ణమ్ములఁ - గాకలీధ్వనుల్ / సం-
పూర్ణమ్ములు - మోద కావ్యముల్ 

వైసారుల - వన్నె లోచెలీ / యీ
కాసారపు - గట్టులన్ గనన్ 
వేసారిన - వింత మన్కిలో / ని- 
స్సారమ్మగు - సారవంతమై 

హాసమ్ములు - హర్ష గాథలే / యీ 
వాసమ్మున - వంత లెందుకో 
రాసమ్మున - రమ్య నృత్యమే / సు-
ప్రాసమ్ముల - పద్య కేళికల్

విధేయుదు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu vaisArI - 

aadhAramu - vAgvallabha 
vaitALIyapu oka pratyEkata yidi. 
# UUII - UIUIU# - ta/ja/ra    - bEsi pAdamulu
#UUUII - UIUIU# - ma/sa/ja/ga - sari pAdamulu

vaisArin aMTE saMskRtamulO chEpa. 

vaisArI - ta/ja/ra // ma/sa/ja/ga 
#UUII - UIUIU // U UUII - UIUIU# 

nIkOsame - nEnu vEchitin 
rAkAchaMdruni - rAka yeppuDO 
nAkAmini - nannu gAMchunA 
nAkammippuDu - nAku@M jUpunA 

aalOchana-laMdu nIvegA 
nAlOlammagu - yAminin sakA 
tElen SaSi - tella velgulO 
kAlammayyenu - gAchiyuMTi nEn 

reMDu pAdamulanu chErchinappuDu - 

varNammulu - bhrAMti@m golpa@MgA / nA 
svarNammula - saMdhya vELalO 
karNammula@M - gAkalIdhvanul / saM-
pUrNammulu - mOda kAvyamul 

vaisArula - vanne lOchelI / yI
kAsArapu - gaTTulan ganan 
vEsArina - viMta man&kilO / ni- 
ssArammagu - sAravaMtamai 

hAsammulu - harsha gAthalE / yI 
vAsammuna - vaMta leMdukO 
rAsammuna - ramya nRtyamE / su-
prAsammula - padya kELikal

vidhEyudu - jejjAla kRshNa mOhana rAVu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: