[racchabanda] అర్ధసమ వృత్తము వేగవతీ #ardhasama vRttamu vEgavatI#

 

అర్ధసమ వృత్తము వేగవతీ - 

ఇంతకు ముందే దీనిపైన వ్రాసినాను. కాని బేసి పాదములలోని యతి (ఛందోహంసి ఉదాహరణము ప్రకారము) నా ఉద్దేశములో సరి కాదు. సరియైన యతులతో వ్రాసినది ఈ క్రొత్త సందేశము. వేగవతీ వృత్తము మాత్రాసమక చతుష్పది ఆపాతలికయొక్క ఒక ప్రత్యేకత. 

వేగవతీ (సారసికా) - IIUII - UII UU // UII UII - UII UU

లత చేసెడు - లాస్యము నీవా 
చూతపు కోకిల - సుస్వర మీవా 
గతమిచ్చిన - కానుక నీవా 
చేతులకందని - చెల్వము నీవా 

కలవీణనుఁ - గమ్మఁగ మీటన్ 
జీకటి వెల్గుగఁ - జెచ్చెర మారెన్ 
తలపందునఁ - దథ్యము నీవే 
వేళయు దాఁటెను - వేగవతీ రా 

  IIUII - UII UU - బేసి పాదము 
U IIUII - UII UU - సరి పాదము

ఈ అర్ధసమ వృత్తమును కూడ రెండు పాదములను చేర్చి చదువ వలయునని నా ఉద్దేశము. దానికి ఉదాహరణములు - 

మనమందున - మాధవుఁడన్నన్ / సు-
స్వన మొక్కటె - చాలును నాకున్ 
ప్రణయమ్మునఁ - బ్రాణము నీవే / నా 
కనయమ్మొక - యండయు నీవే 

చినదానికి - సిగ్గు కలింగెన్ / దాఁ-
చిన ప్రాయపు - చెల్వము పూచెన్ 
కనుదోయికిఁ - గమ్మని విందా / జీ- 
వన మిచ్చిన - శ్రీల పసందా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu vEgavatI - 

iMtaku muMdE dInipaina vrAsinAnu. kAni bEsi pAdamulalOni yati (ChaMdOhaMsi udAharaNamu prakAramu) nA uddESamulO sari kAdu. sariyaina yatulatO vrAsinadi ee krotta saMdESamu. vEgavatI vRttamu mAtrAsamaka chatushpadi aapAtalikayokka oka pratyEkata. 

vEgavatI (sArasikA) - #IIUII - UII UU // UII UII - UII UU#

lata chEseDu - lAsyamu nIvA 
chUtapu kOkila - susvara mIvA 
gatamichchina - kAnuka nIvA 
chEtulakaMdani - chelvamu nIvA 

kalavINanu@M - gamma@Mga mITan 
jIkaTi velguga@M - jechchera mAren 
talapaMduna@M - dathyamu nIvE 
vELayu dA@MTenu - vEgavatI rA 

#  IIUII - UII UU# - bEsi pAdamu 
#U IIUII - UII UU# - sari pAdamu

ee ardhasama vRttamunu kUDa reMDu pAdamulanu chErchi chaduva valayunani nA uddESamu. dAniki udAharaNamulu - 

manamaMduna - mAdhavu@MDannan / su-
svana mokkaTe - chAlunu nAkun 
praNayammuna@M - brANamu nIvE / nA 
kanayammoka - yaMDayu nIvE 

chinadAniki - siggu kaliMgen / dA@M-
china prAyapu - chelvamu pUchen 
kanudOyiki@M - gammani viMdA / jI- 
vana michchina - SrIla pasaMdA

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: