[racchabanda] అర్ధసమ వృత్తము అపరవక్త్రా పాట రూపములో #ardhasama vRttamu aparavaktrA pATa rUpamulO#

 

అర్ధసమ వృత్తము అపరవక్త్రా పాట రూపములో - 

రెండు పాదములను చేర్చి పాట రూపములో - 

బేసి పాదములు - భద్రికా, సుభద్రికా, ప్రసభ, అపరవక్త్రా - న/న/ర/లగ III III - UIUIU 11 త్రిష్టుప్పు 704 
సరి పాదములు - మాలతీ, తతి, యమునా, వరతను - న/జ/జ/ర IIII UII - UIUIU 12 జగతి 1392 

విరులు విరిసె - వేయి రంగులన్ / మధు-
కర మెల్లెడఁ - గంపనమ్ములన్ 
హరితము తరు-లందు నందమై / యల
ఝరియున్ గడు - సందడిన్ జనెన్ 

మదనుఁ డెచట - మానసమ్ములో / నను 
వదలెన్ గద - వాఁడు క్రూరుఁడై 
వదలె నతఁడు - వానకారులో / జిఱు   
హృదయ మ్మిట - నేడ్చుచుండెనే 

నిజము రజని - నిద్ర రాదుగా / పద 
రజ మింటను - రాలునా సఖా  
గజలులఁ బలు - కంటినీటితో / విన 
మజ వీడెను - మానసమ్ములో  

ప్రతియొక విరి - పల్కుచుండెనా / యను-
గతమై నును - గాలి వీచెనా 
బ్రతుకను విరి - పాడుచుండెనా / పరి- 
చిత దైవము - చిత్తగించునా 

విరహ మొసఁగు - వేదనామృత / మ్మిఁక 
విరహ మ్మొక - ప్రేమ శాపమా 
నిరత మలరు - స్నేహపుష్పమా / యది 
పెర యిచ్చెడు - ప్రేమ బిందువా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu aparavaktrA pATa rUpamulO - 

reMDu pAdamulanu chErchi pATa rUpamulO - 

baesi paadamulu - bhadrikaa, subhadrikaa, prasabha, aparavaktraa - na/na/ra/laga #III III - UIUIU# 11 trishTuppu 704 
sari paadamulu - maalatee, tati, yamunaa, varatanu - na/ja/ja/ra #IIII UII - UIUIU# 12 jagati 1392 

virulu virise - vEyi raMgulan / madhu-
kara melleDa@M - gaMpanammulan 
haritamu taru-laMdu naMdamai / yala
jhariyun gaDu - saMdaDin janen 

madanu@M DechaTa - mAnasammulO / nanu 
vadalen gada - vA@MDu krUru@MDai 
vadale nata@MDu - vAnakArulO / ji~ru   
hRdaya mmiTa - nEDchuchuMDenE 

nijamu rajani - nidra rAdugA / pada 
raja miMTanu - rAlunA saKA  
gajalula@M balu - kaMTinITitO / vina 
maja vIDenu - mAnasammulO  

pratiyoka viri - palkuchuMDenA / yanu-
gatamai nunu - gAli vIchenA 
bratukanu viri - pADuchuMDenA / pari- 
chita daivamu - chittagiMchunA 

viraha mosa@Mgu - vEdanAmRta / mmi@Mka 
viraha mmoka - prEma SApamA 
nirata malaru - snEhapushpamA / yadi 
pera yichcheDu - prEma biMduvA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: