[racchabanda] అర్ధసమ వృత్తము ప్రేమబాష్పము #ardhasama vRttamu prEmabAshpamu#

 

అర్ధసమ వృత్తము ప్రేమబాష్పము - 

వైతాళీయము గణ ఛందస్సుతో కూడిన మాత్రా ఛందస్సు. ఇది ఒక అర్ధసమక మాత్రావృత్తము. బేసి పాదములలో ఆఱు మాత్రలు మొదటి భాగములో, చివరి భాగములో ర/లగ గణములు. సరి పాదములలో ప్రథమార్ధములో ఎనిమిది మాత్రలు, ద్వితీయార్ధములో ర/లగ గణములు. మాత్రల సరి స్థానములో గురువు ఉండదు. 

చంపకోత్పలమాలలలో చివరి పది అక్షరాలతో ఏకరూప వృత్తమును మీకు తెలియజేసినాను. ఒకప్పుడు శ్రీ ధనికొండ రవిప్రసాద్‌గారు మాలావృత్తములలో యతి స్థానమునుండి పాదాంతమువఱకు గల 11 అక్షరములతో ఉత్పలరేఖ అనే ఒక వృత్తమును కల్పించినారు. ఈ ఉత్పలరేఖ ఒక అష్టమాత్రా వృత్తము. మొదటి భాగములో రెండు చతుర్మాత్రలతో ఒక అష్టమాత్ర, రెండవ భాగములో రెండు చతుర్మాత్రలు కాని ఒక అష్టమాత్ర. ఇలాటిదే పురాతన వృత్తమైన మాలతీ వృత్తము (మాలతి - న/జ/జ/ర IIII UII - UIUIU 12 జగతి 1392). ఏకరూప, ఉత్పలరేఖా వృత్తములతో వైతాళీయపు ఒక ప్రత్యేకతను కల్పించ వీలగును. 

అర్ధసమ వృత్తము ప్రేమబాష్పము - 

బేసి పాదములు - సహజా లేక ఏకరూప - స/స/జ/గ IIUII - UIUIU 10 పంక్తి 348
సరి పాదములు - ఉత్పలరేఖా - భ/భ/ర/లగ, యతి (1, 7) UUI UUI - UIUIU 11 త్రిష్టుప్పు 695

వనజాక్షికి - వంతలేలకో 
మానసమందున - మంథనమ్ములా 
కనులందునఁ - గాంతు లెక్కడో 
కానని వెల్గుల - కాతురమ్ములా 

రసపూరిత - రాసకేళిలో 
భాసురమై మనె - భావగీతులే 
దెసలెల్లెడ - దివ్యకాంతులే 
హాసమునందున - హర్షరావమే 

గగనమ్మునఁ - గాంతి నిండఁగా 
సాఁగెను జంద్రుఁడు - చందనద్యుతిన్ 
మొగమందున - ముంగురుల్ గనన్ 
వేగము చిందెను - బ్రేమబాష్పముల్ 

నా ఉద్దేశములో దీనిని కూడ రెండు పాదములను కలిపి పాడవలెను. వాటికి ఉదాహరణములు - 

అధరమ్ముల - కందమిచ్చునా / యా
సుధఁ జిందెడు - సొంపు గీతికల్
యదునందను - హాసబిందువుల్ / నా 
హృదయమ్మునఁ - బ్రేమసింధువుల్ 

వరవీణను - వాణి మీటఁగా / సం-
బరమొందుచుఁ - బాట పాడితిన్ 
జరణమ్ములఁ - జంపకమ్ములన్ / స్వీ-
కరణమ్మనెఁ - గారుణమ్ముతో 

సుదతీమణి - సుందరీ సఖీ / బు-
ద్బుదమో యనఁ - బుల్కలిత్తువే 
వదనమ్మున - వంద నవ్వులన్ / నా 
హృదయమ్మున - నృత్యమాడవా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu prEmabAshpamu - 

vaitALIyamu gaNa ChaMdassutO kUDina mAtrA ChaMdassu. idi oka ardhasamaka mAtrAvRttamu. bEsi pAdamulalO aa~ru mAtralu modaTi bhAgamulO, chivari bhAgamulO ra/laga gaNamulu. sari pAdamulalO prathamArdhamulO enimidi mAtralu, dvitIyArdhamulO ra/laga gaNamulu. mAtrala sari sthAnamulO guruvu uMDadu. 

chaMpakOtpalamAlalalO chivari padi axarAlatO EkarUpa vRttamunu mIku teliyajEsinAnu. okappuDu SrI dhanikoMDa raviprasAd^gAru mAlAvRttamulalO yati sthAnamunuMDi pAdAMtamuva~raku gala 11 axaramulatO utpalarEkha anE oka vRttamunu kalpiMchinAru. ee utpalarEkha oka ashTamAtrA vRttamu. modaTi bhAgamulO reMDu chaturmAtralatO oka ashTamAtra, reMDava bhAgamulO reMDu chaturmAtralu kAni oka ashTamAtra. ilATidE purAtana vRttamaina mAlatI vRttamu (mAlati - na/ja/ja/ra #IIII UII - UIUIU# 12 jagati 1392). EkarUpa, utpalarEkhA vRttamulatO vaitALIyapu oka pratyEkatanu kalpiMcha vIlagunu. 

ardhasama vRttamu prEmabAshpamu - 

bEsi pAdamulu - sahajA lEka EkarUpa - sa/sa/ja/ga #IIUII - UIUIU# 10 paMkti 348
sari pAdamulu - utpalarEkhaa - bha/bha/ra/laga, yati (1, 7) #UUI UUI - UIUIU# 11 trishTuppu 695

vanajAxiki - vaMtalElakO 
mAnasamaMduna - maMthanammulA 
kanulaMduna@M - gAMtu lekkaDO 
kAnani velgula - kAturammulA 

rasapUrita - rAsakELilO 
bhAsuramai mane - bhAvagItulE 
desalelleDa - divyakAMtulE 
hAsamunaMduna - harsharAvamE 

gaganammuna@M - gAMti niMDa@MgA 
sA@Mgenu jaMdru@MDu - chaMdanadyutin 
mogamaMduna - muMgurul ganan 
vEgamu chiMdenu - brEmabAshpamul 

nA uddESamulO dInini kUDa reMDu pAdamulanu kalipi pADavalenu. vATiki udAharaNamulu - 

adharammula - kaMdamichchunA / yA
sudha@M jiMdeDu - soMpu gItikal
yadunaMdanu - hAsabiMduvul / naa 
hRdayammuna@M - brEmasiMdhuvul 

varavINanu - vANi mITa@MgA / saM-
baramoMduchu@M - bATa pADitin 
jaraNammula@M - jaMpakammulan / svI-
karaNammane@M - gAruNammutO 

sudatImaNi - suMdarI sakhI / bu-
dbudamO yana@M - bulkalittuvE 
vadanammuna - vaMda navvulan / nA 
hRdayammuna - nRtyamADavA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: