[racchabanda] అర్ధసమ వృత్తము భావనాద్యుతి #ardhasama vRttamu bhAvanAdyuti #

 

అర్ధసమ వృత్తము భావనాద్యుతి - 

ఆధారము - కల్పితము 
బేసి పాదములు - వృషభగతి రగడ యందలి ఒక ప్రత్యేకత ఝుల్లిక 
సరి పాదములు - మత్తకోకిల 

ఇట్టి లయతో ఒక అర్ధసమగీతిని ఇంతకు ముందు మీకు వివరించియున్నాను (కృష్ణగీతి - 18 November 2017).

వేదమంత్రము నీదు పల్కులు - వేగ రమ్మిటఁ బ్రేమమూర్తీ 
కాదు కాదని చెప్పబోకుమ - కామవర్షుఁడు నీవెగా 
నీదు రూపము నాకు దీపము - స్నేహలోకపు చక్రవర్తీ 
బాధ లన్నిటిఁ బాప వేలకొ - భావనాద్యుతి నీవెగా 

చెంగుచెంగున లేడి యిచ్చట - చేర రమ్మన మోము వంచెన్
శృంగమందున మేఘమాలల్ - చిమ్మసాఁగెను వర్షమున్ 
భృంగి యొక్కటి వానలోఁ దను - వేగఁ బూలను జేర నెంచెన్ 
రంగురంగుల యింద్రచాపము - రక్తి నిచ్చెను హర్షమున్ 

రేయిలో నిఁక నేనె రాజును - రమ్ము ప్రక్కన రాణి నీవే 
హాయిహాయిగ రాగవీణను - హ్లాద మీయఁగ మీటనా 
వేయి కన్నుల రాత్రిలో సిరి - వెన్నెలమ్మవు నాకు నీవే 
మాయలో నిను ముంచి లేపుచు - మత్తు ముద్దుల నాఁటనా 

ఫాలనేత్రుని కన్నులందున - భగ్గు మంచును వేడి గాడ్పుల్ 
మ్రోల నిల్చిన నంది చేసెను - భోరుమంచును ఱంకెలన్ 
చాల చప్పుడుతోడ నిండెను - చర్మవాద్యపు టార్తి యేడ్పుల్ 
నేల కంత్యమొ లెక్కపెట్టెను - నీరజాసనుఁ డంకెలన్

విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu bhAvanAdyuti - 

aadhAramu - kalpitamu 
bEsi pAdamulu - vRshabhagati ragaDa yaMdali oka pratyEkata jhullika 
sari pAdamulu - mattakOkila 

iTTi layatO oka ardhasamagItini iMtaku muMdu mIku vivariMchiyunnAnu (kRshNagiiti - 18 #November# 2017).

vEdamaMtramu nIdu palkulu - vEga rammiTa@M brEmamUrtI 
kAdu kAdani cheppabOkuma - kAmavarshu@MDu nIvegA 
nIdu rUpamu nAku dIpamu - snEhalOkapu chakravartI 
bAdha lanniTi@M bApa vElako - bhAvanAdyuti nIvegA 

cheMgucheMguna lEDi yichchaTa - chEra rammana mOmu vaMchen
SRMgamaMduna mEghamAlal - chimmasA@Mgenu varshamun 
bhRMgi yokkaTi vAnalO@M danu - vEga@M bUlanu jEra neMchen 
raMguraMgula yiMdrachApamu - rakti nichchenu harshamun 

rEyilO ni@Mka nEne rAjunu - rammu prakkana rANi nIvE 
hAyihAyiga rAgavINanu - hlAda mIya@Mga mITanA 
vEyi kannula rAtrilO siri - vennelammavu nAku nIvE 
mAyalO ninu muMchi lEpuchu - mattu muddula nA@MTanA 

phAlanEtruni kannulaMduna - bhaggu maMchunu vEDi gADpul 
mrOla nilchina naMdi chEsenu - bhOrumaMchunu ~raMkelan 
chAla chappuDutODa niMDenu - charmavAdyapu TArti yEDpul 
nEla kaMtyamo lekkapeTTenu - nIrajAsanu@M DaMkelan

vidhEyuDu - jejJAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: