[racchabanda] అర్ధసమ వృత్తము మాణిక్యవీణ #ardhasama vRttamu mANikyavINa#

 

అర్ధసమ వృత్తము మాణిక్యవీణ - 

ఆధారము - కల్పితము 

బేసి పదములు - శార్దూలలలితము - మ/స/జ/స/త/స 
UUU IIU IUI IIU - UUI IIU
సరి పదములు - శార్దూలవిక్రీడితము - మ/స/జ/స/త/త/గ 
UUU IIU IUI IIU - UUI UUIU

రామయ్యా నను బ్రోవుమయ్య దయతోఁ - బ్రార్థింతు మిము నా- 
రామ మ్మీ హృదయమ్ములోఁ దమరిదే - రమ్యమ్ముగా భాసిలెన్ 
సీమాతీతము నాదు హర్షము గదా - సేవించఁగ మిమున్ 
బ్రేమన్ నిండుచుఁ బొంగిపోవు మది మీ - పేరిన్ దలంచన్ సదా 

ఏనాఁడో కనినట్టి వేళ నిను నే - నేపూజ ఫలమో 
యీనాఁడీ మదిలోన నూత్న ఛవులన్ - సృష్టించఁగా నుంటివా
ఆనందాబుధిపైని ఫేనములుగా - హాసమ్ము గలదో 
ఓనందాత్మజ నన్ను జూడఁగను నీ-వుల్లాసమై యుంటివా 

సంద్రమ్మందునఁ బోటు లెక్కువయె దో-చంగాను నిశిలోఁ  
జంద్రుం డాకసమందు నిండెఁ బ్రభలున్ - జాజ్వల్యమానమ్ముగా 
నింద్రుం డంపెనొ దేవకన్య నిటకున్ - నృత్యమ్ము సలుపన్ 
మంద్రమ్మైన రవమ్ముతో నుడువఁగా - మాణిక్యవీణన్ లలిన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu mANikyavINa - 

aadhAramu - kalpitamu 

bEsi padamulu - SArdUlalalitamu - ma/sa/ja/sa/ta/sa 
#UUU IIU IUI IIU - UUI IIU#
sari padamulu - SArdUlavikrIDitamu - ma/sa/ja/sa/ta/ta/ga 
#UUU IIU IUI IIU - UUI UUIU#

rAmayyA nanu brOvumayya dayatO@M - brArthiMtu mimu nA- 
rAma mmI hRdayammulO@M damaridE - ramyammugA bhAsilen 
sImAtItamu nAdu harshamu gadA - sEviMcha@Mga mimun 
brEman niMDuchu@M boMgipOvu madi mI - pErin dalaMchan sadA 

EnA@MDO kaninaTTi vELa ninu nE - nEpUja phalamO 
yInA@MDI madilOna nUtna Chavulan - sRshTiMcha@MgA nuMTivA
aanaMdAbudhipaini phEnamulugA - hAsammu galadO 
OnaMdAtmaja nannu jUDa@Mganu nI-vullAsamai yuMTivA 

saMdrammaMduna@M bOTu lekkuvaye dO-chaMgAnu niSilO@M  
jaMdruM DAkasamaMdu niMDe@M brabhalun - jAjvalyamAnammugA 
niMdruM DaMpeno dEvakanya niTakun - nRtyammu salupan 
maMdrammaina ravammutO nuDuva@MgA - mANikyavINan lalin 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: