[racchabanda] ఔపచ్ఛందసికాపరాంతికా #aupachChaMdasikAparAMtikA#

 

ఔపచ్ఛందసికాపరాంతికా - 

ఇది ఒక చతుష్పది. ఇందులో అన్ని పాదములలో ఔపచ్ఛందసికలోని సరి పాదములు ఉండును. వాటి అమరిక 8 మాత్రలు + ర/య. ఎనిమిది మాత్రలలో నాలుగుకన్న ఎక్కువ లఘువులు పక్కపక్కన ఉండరాదు. క్రింద నా ఉదాహరణములు - 

ఔపచ్ఛందసికాపరాంతికా - 8 మాత్రలు + ర/య

చందన చర్చిత - చారు రూప రంగా 
సుందర సురుచిర - శోభితాంతరంగా  
నందకిశోరా - నాదపూర్ణసారా 
యిందునిభానన - యిందిరాపతీ రా 

కమలాకరమునఁ - గంజషండ మెందున్ 
విమలాదిత్యుని - వెల్గు తూర్పునందున్ 
భ్రమలిడు కాంతులె - రమ్యవర్ణ మాయన్ 
రమణుని పూజకు - రమ్ము పూలు కోయన్ 

వంతలు వద్దిఁక - వాఁడు వచ్చు దేవీ 
చింతలు చాలిఁక - చిత్తమందుఁ దన్వీ 
కంతుఁడు వానికిఁ - గామ మిచ్చుఁ గాదా 
చెంతను వచ్చును - జెప్పకుండ రాధా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aupachChaMdasikAparAMtikA - 

idi oka chatushpadi. iMdulO anni pAdamulalO aupachChaMdasikalOni sari pAdamulu uMDunu. vATi amarika 8 mAtralu + ra/ya. enimidi mAtralalO nAlugukanna ekkuva laghuvulu pakkapakkana uMDarAdu.. kriMda nA udAharaNamulu - 

aupachChaMdasikAparAMtikA - 8 mAtralu + ra/ya

chaMdana charchita - chAru rUpa raMgA 
suMdara suruchira - SObhitAMtaraMgA  
naMdakiSOrA - nAdapUrNasArA 
yiMdunibhAnana - yiMdirApatI rA 

kamalAkaramuna@M - gaMjashaMDa meMdun 
vimalAdityuni - velgu tUrpunaMdun 
bhramaliDu kAMtule - ramyavarNa mAyan 
ramaNuni pUjaku - rammu pUlu kOyan 

vaMtalu vaddi@Mka - vA@MDu vachchu dEvI 
chiMtalu chAli@Mka - chittamaMdu@M danvI 
kaMtu@MDu vAniki@M - gAma michchu@M gAdA 
cheMtanu vachchunu - jeppakuMDa rAdhA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: