[racchabanda] భృండి #bhRMDi#

 

భృండి - 

ఆధారము - కల్పితము
మందాక్రాంతములోని 1,2,4 స్థానములలోని గురువులను రెండు లఘువులుగా మార్చగా జనించిన వృత్తము. యతులు సంస్కృత మందాక్రాంతములోవలె. భృండి అనగా అల అని అర్థము. 

భృండి - న/జ/న/న/త/త/గగ IIII UII - IIIIIU - UIU UIUU
20 కృతి 151536 

పిలిచెను నాహృది - ప్రియతరముగా - ప్రీతితో రమ్ము దేవీ 
తలఁచెను నామది - తఱచుగ నినున్ - ధ్వాంతమందుండు వేళన్ 
వలపుల గాలులు - వదలక నిటన్ - వచ్చునో నేఁడు రాదో 
మలుపుల త్రోవల - మనికి నిజమై - మభ్యమో మాయ యేమో

తెలుఁగున గీతము - దినము దినమున్ - దీయఁగాఁ బాడవేలా 
కలుగును మోదము - గళము వినఁగా - కాకలీ సుస్వరమ్ముల్ 
వెలుఁగుల వడిలో - వెలయుఁ బులుఁగై - వేగ మాకాశవీథిన్ 
మలసిన దేహము - మఱల నిలువన్ - మందు సంగీతమౌనా 

కవితల వ్రాసితిఁ - గమలనయనా - కాటుకన్ దిద్ది నీకై 
యివి జననమ్మగు - హృదయసరసిన్ - భృండులై లేచి యాడున్ 
భువనపు టెల్లల - ముదము నొసఁగన్ - బుల్గులై యుద్గమించున్ 
రవివలెఁ గాంతుల - రమణఁ బఱచున్ - రంజిల్లఁగా విశ్వముల్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
bhRMDi - 

aadhAramu - kalpitamu
maMdAkrAMtamulOni 1,2,4 sthAnamulalOni guruvulanu reMDu laghuvulugA mArchagA janiMchina vRttamu. yatulu saMskRta maMdAkrAMtamulOvale. bhRMDi anagA ala ani arthamu. 

bhRMDi - na/ja/na/na/ta/ta/gaga #IIII UII - IIIIIU - UIU UIUU#
20 kRti 151536 

pilichenu nAhRdi - priyataramugA - prItitO rammu dEvI 
tala@Mchenu nAmadi - ta~rachuga ninun - dhvAMtamaMduMDu vELan 
valapula gAlulu - vadalaka niTan - vachchunO nE@MDu rAdO 
malupula trOvala - maniki nijamai - mabhyamO mAya yEmO

telu@Mguna gItamu - dinamu dinamun - dIya@MgA@M bADavElA 
kalugunu mOdamu - gaLamu vina@MgA - kAkalI susvarammul 
velu@Mgula vaDilO - velayu@M bulu@Mgai - vEga mAkASavIthin 
malasina dEhamu - ma~rala niluvan - maMdu saMgItamaunA 

kavitala vrAsiti@M - gamalanayanA - kATukan diddi nIkai 
yivi jananammagu - hRdayasarasin - bhRMDulai lEchi yADun 
bhuvanapu Tellala - mudamu nosa@Mgan - bulgulai yudgamiMchun 
ravivale@M gAMtula - ramaNa@M ba~rachun - raMjilla@MgA viSvamul 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

No comments: