[racchabanda] గ్రీష్మ #grIshma#

 

గ్రీష్మ - 

ఆధారము - కల్పితము
మందాక్రాంతములోని మొదటి మూడు గురువులకు బదులు ఆఱు లఘువులు ఈ వృత్తములోని ప్రత్యేకత. 

గ్రీష్మ - న/న/భ/న/త/త/గగ IIII IIU - IIIIIU - UIU UIUU
20 కృతి 151488 

చలనరహితమై - సరసహృదయా - సంధ్యలో వేచియుంటిన్ 
గలలకుఁ కరువై - కనుల బరువై - కారుచీఁకట్లు వచ్చున్ 
శిల కొక నసువున్ - సిరిగ నొసఁగన్ - శీఘ్రమే రమ్ము చెంతన్ 
నలినమువలెఁ దా - ననయు విరియున్ - నక్తమందంద మీయన్ 

మదిర మగతయో - మదిని వెతయో - మాయలో నుంటి నిట్టుల్ 
మదనుని శరముల్ - మరలి వెడలెన్ - మ్లానమౌ గ్రీష్మమందున్ 
మృదు మధురముగా - మెలఁగు కవితల్ - మెల్లఁగా నింకిపోయెన్  
నది యది యిసుకై - నభము గనుచున్ - నావలెన్ జిక్కిపోయెన్ 

జలములు వడిగా - జలధిఁ గలియన్ - సాఁగు మోదమ్ముతోడన్ 
జలము మరుగగున్ - జలము మరుగున్ - సంద్రమున్ జూడకుండన్ 
సలిలమువలెనే - సగటు బ్రదుకుల్ - స్వామినిన్ జేరకుండున్ 
కల యొక కలగాఁ - గరఁగుఁ ద్రుటిలోఁ - గాలమే కాటువేయున్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు 
#
grIshma - 

aadhAramu - kalpitamu
maMdAkrAMtamulOni modaTi mUDu guruvulaku badulu aa~ru laghuvulu ee vRttamulOni pratyEkata. 

grIshma - na/na/bha/na/ta/ta/gaga #IIII IIU - IIIIIU - UIU UIUU#
20 kRti 151488 

chalanarahitamai - sarasahRdayA - saMdhyalO vEchiyuMTin 
galalaku@M karuvai - kanula baruvai - kAruchI@MkaTlu vachchun 
Sila koka nasuvun - siriga nosa@Mgan - SIghramE rammu cheMtan 
nalinamuvale@M dA - nanayu viriyun - naktamaMdaMda mIyan 

madira magatayO - madini vetayO - mAyalO nuMTi niTTul 
madanuni Saramul - marali veDalen - m&lAnamau grIshmamaMdun 
mRdu madhuramugA - mela@Mgu kavital - mella@Mgaa niMkipOyen  
nadi yadi yisukai - nabhamu ganuchun - nAvalen jikkipOyen 

jalamulu vaDigA - jaladhi@M galiyan - sA@Mgu mOdammutODan 
jalamu marugagun - jalamu marugun - saMdramun jUDakuMDan 
salilamuvalenE - sagaTu bradukul - svAminin jErakuMDun 
kala yoka kalagA@M - gara@Mgu@M druTilO@M - gAlamE kATuvEyun 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAVu 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: