[racchabanda] క్షుత్క్షీణ #kshutkshINa#

 

క్షుత్క్షీణ - 

ఆధారము - పింగళ ఛందస్సులోని వైతాళీయోదాహరణము 
ఈ క్షుత్క్షీణ అనే పేరు ఛందోరచనా అనే గ్రంథములో గలదు. 

బేసి పాదములు - త/జ/ర
సరి పాదములు - మ/స/జ/గ 
 
  UUII - UIUIU 
U UUII - UIUIU

రాఁడా యని - రాత్రి వేళలో 
మేడన్ గూర్చొని - మెల్లమెల్లఁగాఁ 
దోఁడెన్ బలు - దోర యోచనల్ 
నీడన్ జూచుచు - నేస్తుఁ దల్చుచున్ 

శ్రీవాణిని - జిత్తరంజనిన్ 
దేవిన్ లక్ష్మిని - దివ్యరూపిణిన్ 
జీవేశ్వరి - సింహవాహినిన్ 
గావన్ వారిని - గై మొగుడ్తు నేన్ 

రెండు పాదములను చేర్చి చదువుటకై వ్రాసినది - 

ఆనందపు - టంబురాశిలో / నా 
ఫేనమ్ములు - వెల్గుచుండఁగా 
గానమ్ముల - గంగ చేరె / బ్ర-
హ్మానందపు - టారవమ్ముతో 

నీకంకణ - నిక్వణమ్ములో / నా 
కాకాశపు - టంచు మ్రోఁతలే 
నీకన్నుల - నెమ్మి చూపులే / నా 
కాకర్షణ - కంచు గీతలే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
xutkshINa - 

aadhAramu - piMgaLa ChaMdassulOni vaitALIyOdAharaNamu 
ee xutkshINa anE pEru ChaMdOrachanA anE graMthamulO galadu. 

bEsi pAdamulu - ta/ja/ra
sari pAdamulu - ma/sa/ja/ga 
  UUII - UIUIU 
U UUII - UIUIU#

rA@MDA yani - rAtri vELalO 
mEDan gUrchoni - mellamella@MgA@M 
dO@MDen balu - dOra yOchanal 
nIDan jUchuchu - nEstu@M dalchuchun 

SrIvANini - jittaraMjanin 
dEvin laxmini - divyarUpiNin 
jIvESvari - siMhavAhinin 
gAvan VArini - gai moguDtu nEn 

reMDu pAdamulanu chErchi chaduvuTakai vrAsinadi - 

aanaMdapu - TaMburASilO / nA 
phEnammulu - velguchuMDa@MgA 
gAnammula - gaMga chEre / bra-
hmAnaMdapu - TAravammutO 

nIkaMkaNa - nikvaNammulO / nA 
kAkASapu - TaMchu mrO@MtalE 
nIkannula - nemmi chUpulE / nA 
kAkarshaNa - kaMchu gItalE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: