[racchabanda] కుఱుచ, నిడుద పాదములతో ఆఱు విధములైన కందములు #ku~rucha, niDuda pAdamulatO aa~ru vidhamulaina kaMdamulu#

 

కుఱుచ, నిడుద పాదములతో ఆఱు విధములైన కందములు - 

కందములో రెండు విధములైన పాదములు ఉన్నాయి, అవి కుఱుచ (కు), నిడుద (ని) పాదములు. రెండు పాదములను ఆఱు విధములుగా అమర్చ వీలగును. అందులో మొదటిది మనకందఱికి తెలిసిన కు/ని/కు/ని కందపద్యము. మిగిలిన వాటికి కూడ ఇక్కడ ఉదాహరణములను ఇచ్చినాను. వివరాలకు కందపద్యముపైన వ్యాసములను చదవండి.  

కందము - కు/ని/కు/ని 
తల్లీ దలంతు నిన్నే 
యుల్లమ్మందుండు మమ్మ - యుల్లసమున శో-
భిల్లం జేయుము పల్కుల 
ఫుల్లాంబుజనేత్ర దేవి - పూర్ణశశిముఖీ 

మణికందము - ని/కు/ని/కు
చల్లని వెన్నెలలవోలెఁ - జక్కఁగ మది సం-
ఫుల్లమ్మయ్యెను వాణీ 
యల్లెదమిఁక కవితలెన్నొ - యందమ్ముగ రా-
జిల్లఁగ మణికందములై 

మాకందము - కు/కు/ని/ని
నిధియే యవి పెన్నిధియే 
ముదమిచ్చును రసమయమగు 
మధుమాసములోన నెందు - మాకందములే 
విధిగా వినబడును రమ్య - పికరావములే 

శ్రీకందము - ని/ని/కు/కు
శ్రీవారికిఁ బ్రేమలేఖ - శ్రీకందములో 
భావమ్ముల నింపి వ్రాసి - పంపెద నిపుడే 
నావాంఛలఁ దెలుపఁగఁ దా 
నీవిరహము బాపుదురో 

మధుకందము - కు/ని/ని/కు
మధుకందములా నింగిన్ 
మృదుగతితో సాఁగుచుండె - నెంతయొ సొగసై 
కదలుచు వేవేగ నాదు - కథలన్ జెప్పన్ 
మదిరాక్షికి దూరములో 

రసకందము - ని/కు/కు/ని
రసమయమగు వేళ యిదియు - రాత్రియు వచ్చెన్ 
రసికుఁడు రాలేదెందుకు 
ముసిముసి నగవుల సిరితో 
దెసలను నేఁజూచుచుంటిఁ - దెరువరి యెచటో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ku~rucha, niDuda pAdamulatO aa~ru vidhamulaina kaMdamulu - 

kaMdamulO reMDu vidhamulaina pAdamulu unnAyi, avi ku~rucha (ku), niDuda (ni) pAdamulu. reMDu pAdamulanu aa~ru vidhamulugA amarcha vIlagunu. aMduloe modaTidi manakaMda~riki telisina ku/ni/ku/ni kaMdapadyamu. migilina vATiki kUDa ikkaDa udAharaNamulanu ichchinAnu. vivarAlaku kaMdapadyamupaina vyAsamulanu chadavaMDi.  

kaMdamu - ku/ni/ku/ni 
tallI dalaMtu ninnE 
yullammaMduMDu mamma - yullasamuna SO-
bhillaM jEyumu palkula 
phullAMbujanEtra dEvi - pUrNaSaSimukhI 

maNikaMdamu - ni/ku/ni/ku
challani vennelalavOle@M - jakka@Mga madi saM-
phullammayyenu vANI 
yalledami@Mka kavitalenno - yaMdammuga rA-
jilla@Mga maNikaMdamulai 

mAkaMdamu - ku/ku/ni/ni
nidhiyE yavi pennidhiyE 
mudamichchunu rasamayamagu 
madhumAsamulOna neMdu - mAkaMdamulE 
vidhigA vinabaDunu ramya - pikarAvamulE 

SrIkaMdamu - ni/ni/ku/ku
SrIvAriki@M brEmalEkha - SrIkaMdamulO 
bhAvammula niMpi vrAsi - paMpeda nipuDE 
nAvAMChala@M delupa@Mga@M dA 
nIvirahamu bApudurO 

madhukaMdamu - ku/ni/ni/ku
madhukaMdamulA niMgin 
mRdugatitO sA@MguchuMDe - neMtayo sogasai 
kadaluchu vEvEga nAdu - kathalan jeppan 
madirAxiki dUramulO 

rasakaMdamu - ni/ku/ku/ni
rasamayamagu vELa yidiyu - rAtriyu vachchen 
rasiku@MDu rAlEdeMduku 
musimusi nagavula siritO 
desalanu nE@MjUchuchuMTi@M - deruvari yechaTO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: