[racchabanda] ప్రాచ్యవృత్తి #prAchyavRtti#

 

ప్రాచ్యవృత్తి - 

బేసి పాదములు - 6 మాత్రలు + ర/లగ
సరి పాదములు - 3 మాత్రలు + గురువు + 3 మాత్రలు + ర/లగ 

వైతాళీయము, ఔపచ్ఛందసికా, ఆపాతళికా - ఈ మూడింటిలో సరి పాదములలోని మొదటి ఎనిమిది మాత్రలు రెండు చతుర్మాత్రలుగా విఱగాలి. కాని ప్రాచ్యవృత్తిలో అది ఒక అష్టమాత్ర, 5-3 లేక 3-5 మాత్రలుగా విఱుగుతుంది. అనగా సరి పాదములు రథోద్ధత వర్గములోని వృత్తముల లయతో సరిపోతుంది. 

ఆకాశపు - టంద మన్నియున్ 
నీకు దక్కినవి - నేత్రపర్వమై 
రాకాశశి - రమ్యబింబమే 
నీకు దక్కినది - నిండు మోముగా 

మనమందున - మాధవిలతా 
దినము నీవిరులు - దివ్యగంధమే 
నునురేకుల - నూత్న చందముల్ 
తనివి నిచ్చెఁ గడు - తళ్కులీనుచున్ 

సుధఁ బోయుము - సుందరీమణీ 
వ్యధలు వీడగను - స్వాగతమ్ముగా
పద మొక్కటి - పాడుమా సఖీ 
ముదమునొందగను - మోహనమ్ముగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
prAchyavRtti - 

bEsi pAdamulu - 6 mAtralu + ra/laga
sari pAdamulu - 3 mAtralu + guruvu + 3 mAtralu + ra/laga 

vaitALIyamu, aupachChaMdasikA, aapAtaLikA - ee mUDiMTilO sari pAdamulalOni modaTi enimidi mAtralu reMDu chaturmAtralugA vi~ragAli. kAni prAchyavRttilO adi oka ashTamAtra, 5-3 lEka 3-5 mAtralugA vi~rugutuMdi. anagA sari pAdamulu rathOddhata vargamulOni vRttamula layatO saripOtuMdi. 

aakASapu - TaMda manniyun 
nIku dakkinavi - nEtraparvamai 
rAkASaSi - ramyabiMbamE 
nIku dakkinadi - niMDu mOmugA 

manamaMduna - mAdhavilatA 
dinamu nIvirulu - divyagaMdhamE 
nunurEkula - nUtna chaMdamul 
tanivi nichche@M gaDu - taLkulInuchun 

sudha@M bOyumu - suMdarImaNI 
vyadhalu vIDaganu - svAgatammugA
pada mokkaTi - pADumA sakhI 
mudamunoMdaganu - mOhanammugA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (3)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: