[racchabanda] రేజోతి #rEjOti#

 

రేజోతి - 

ఆధారము - కల్పితము 
శ్రీ వల్లభపురం జనార్దన్‌గారు ఛందస్సు కూటమిలో సల/త - సల/త - సల/లగ గణములతో ఒక వృత్తమును ఉదాహరించారు. అందులో చివర సల/లగ కు బదులు లయకై స/లగను ఉంచి వ్రాసిన వృత్తము ఇది. దీనికి యతి లేక ప్రాసయతి యేదైనా వాడవచ్చును. 

రేజోతి - స/య/న/ర/భ/జ/గ IIUI UUI - IIUI UUI - IIUIU
19 అతిధృతి 189900 

ప్రాసయతితో - 

దినమెల్ల నేఁ బిల్వ - వినవేలకో నీవు - వనితామణీ 
కనులందు నున్నావు - కనవేలకో నన్ను - వనమోహినీ 
మనమందు నీరూప - మనిశమ్ము రేజోతి - యనఁ జెల్లుఁగా 
ప్రణయంపు గీతమ్ము - నిను దల్చి పాడంగ - విను మెల్లఁగా 

సరసమ్ము లాడంగ - నొరులట్లు సూడంగ - సరికాదురా 
పరుసమ్ము నేఁబల్క - హరుసమ్ముగాఁ దల్చు - హరి నిక్కమై 
చిఱునవ్వులే చాలు - వరహాలతో నిండు - సిరిమూటరా 
వరవేణు రావమ్ముఁ - జిఱుగాలి మోయంగ - దరిసింతురా 

అక్షరసామ్య యతితో -

కలవేణునాదమ్ము - కమనీయ గీతమ్ము - కలిగించె నా 
కలలోన మోదమ్ముఁ - గవితార్ద్ర భావమ్ముఁ - గడు సొంపుగా 
వెలిఁగించు నాత్రోవ - విహరించు నాతోడఁ - బ్రియ యింపుగాఁ 
గలకాల ముండంగఁ - గలలెల్ల పండంగఁ - గవనమ్ముగా 

హృదయాన రాగమ్ము - లివి సంధ్య రాగమ్ము - లెటుఁ జూడఁగా 
ముదమిచ్చు చిత్రమ్ము - పులకించు చిత్తమ్ము - పొడచూపెఁగా 
వదనాన హాసమ్ము - వ్యధలేని సౌఖ్యమ్ము - వరమౌనుగా 
మది నేఁడు నాట్యమ్ము - మహితమ్ముగాఁ జేసె - మధురోహతో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
rEjOti - 

aadhAramu - kalpitamu 
SrI vallabhapuraM janArdan^gAru ChaMdassu kUTamilO sala/ta - sala/ta - sala/laga gaNamulatO oka vRttamunu udAhariMchAru. aMdulO chivara sala/laga ku badulu layakai sa/laganu uMchi vrAsina vRttamu idi. dIniki yati lEka prAsayati yEdainA vADavachchunu. 

rEjOti - sa/ya/na/ra/bha/ja/ga #IIUI UUI - IIUI UUI - IIUIU#
19 atidhRti 189900 

prAsayatitO - 

dinamella nE@M bilva - vinavElakO nIvu - vanitAmaNI 
kanulaMdu nunnAvu - kanavElakO nannu - vanamOhinI 
manamaMdu nIrUpa - maniSammu rEjOti - yana@M jellu@MgA 
praNayaMpu gItammu - ninu dalchi pADaMga - vinu mella@MgA 

sarasammu lADaMga - norulaTlu sUDaMga - sarikAdurA 
parusammu nE@Mbalka - harusammugA@M dalchu - hari nikkamai 
chi~runavvulE chAlu - varahAlatO niMDu - sirimUTarA 
varavENu rAvammu@M - ji~rugAli mOyaMga - darisiMturA 

axarasAmya yatitO -

kalavENunAdammu - kamanIya gItammu - kaligiMche nA 
kalalOna mOdammu@M - gavitArdra bhAvammu@M - gaDu soMpugA 
veli@MgiMchu nAtrOva - vihariMchu nAtODa@M - briya yiMpugA@M 
galakAla muMDaMga@M - galalella paMDaMga@M - gavanammugA 

hRdayAna rAgammu - livi saMdhya rAgammu - leTu@M jUDa@MgA 
mudamichchu chitrammu - pulakiMchu chittammu - poDachUpe@MgA 
vadanAna hAsammu - vyadhalEni saukhyammu - varamaunugA 
madi nE@MDu nATyammu - mahitammugA@M jEse - madhurOhatO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: