[racchabanda] సహజా లేక ఏకరూప #sahajA lEka EkarUpa#

 

సహజా లేక ఏకరూప - 

ఆధారము - జయదామన్ 
చంపకోత్పలమాలలలోని చివరి పది అక్షరాలతో నిర్మింపబడిన వృత్తము. ఇంతకు ముందు రెండు మారులు దీనిని పరిచయము చేసినాను, యతి లేక ఒక మారు, ఎనిమిదవ అక్షరము యతిగా ఒక మారు. ఈ వృత్తమునకు సరియైన యతి ఆఱవ అక్షరము అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వృత్తపు అమరిక వైతాళీయపు బేసి పాదముతో సరిపోతుంది - ఆఱు మాత్రలు + ర/లగ. 

సహజా లేక ఏకరూప - స/స/జ/గ IIUII - UIUIU
10 పంక్తి 348

హృదయమ్మున - నేకరూపమై 
కదలున్గద - కన్నఁడెప్పుడున్ 
నిధి యయ్యెను - నేఁడు వాఁడు వా-
ర్నిధి యయ్యెను - బ్రేమ వానితో 

చెలి రమ్మనెఁ - జెప్ప దెందుకో 
కల నిమ్మనె - ఖర్చుఁ జేసితిన్ 
మెలమెల్లఁగ - మేలమాడెదన్ 
దెలినవ్వులఁ - దేల్చివేసెదన్ 

ఇఁక యెక్కడ - యింద్రచాపముల్ 
సుకమెక్కడ - శోకముండఁగా 
చకితమ్ముల - జాలమందు నా
మొకమందున - మోదముండునా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sahajA lEka EkarUpa - 

aadhAramu - jayadAman 
chaMpakOtpalamAlalalOni chivari padi axarAlatO nirmiMpabaDina vRttamu. iMtaku muMdu reMDu mArulu dInini parichayamu chEsinaanu, yati lEka oka mAru, enimidava axaramu yatigA oka mAru. ee vRttamunaku sariyaina yati aa~rava axaramu ani ippuDu anipistuMdi. eMdukaMTE ee vRttapu amarika vaitALIyapu bEsi pAdamutO saripOtuMdi - aa~ru mAtralu + ra/laga. 

sahajA lEka EkarUpa - sa/sa/ja/ga #IIUII - UIUIU#
10 paMkti 348

hRdayammuna - nEkarUpamai 
kadalun&gada - kanna@MDeppuDun 
nidhi yayyenu - nE@MDu vA@MDu vA-
rnidhi yayyenu - brEma vAnitO 

cheli rammane@M - jeppa deMdukO 
kala nimmane - kharchu@M jEsitin 
melamella@Mga - mElamADedan 
delinavvula@M - dElchivEsedan 

i@Mka yekkaDa - yiMdrachApamul 
sukamekkaDa - SOkamuMDa@MgA 
chakitammula - jAlamaMdu nA
mokamaMduna - mOdamuMDunA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: