[racchabanda] సిరివెన్నెల #sirivennela#

 

సిరివెన్నెల - 

ఆధారము - కల్పితము, తిరుజ్ఞాన సంబందర్ వ్రాసిన ఒకపద్యము (ఉణ్ణాములైయుమైయాళొడు - 
 https://www.youtube.com/watch?v=YzDB3owmZRM ) దీనికి మూలము. 

సిరివెన్నెల - త/న/భ/స/న/లగ UUII IIUII IIUII IIU
17 అత్యష్టి 63421

నిన్నేగద - నెఱ నమ్మితి - నిఖిలమ్మున నెపుడున్ 
నన్నేలకొ - నగుమోమున - నయమై కన విపుడున్ 
వెన్నుండని - వినుతింతును - వినరా కరివరదా 
చెన్నారఁగ - చెలి మోమునఁ - జిఱుముద్దుల నిడరా 

నీనామము - నిజమై యొక - నిధిగాఁ దలఁచితిరా 
నీనాట్యము - నిశియందున - నెలబాలుని కలరా 
నీనాదము - నిఱుపేదకు - నెలవిచ్చిన స్మృతిరా 
కానంగను - గడు పుణ్యము - కమలానన దరిరా 

వారమ్ములు - వరుసమ్ములు - వరముల్ నిను దలువన్ 
భారమ్మగు - బహు వేదన - వరముల్ నిను గలువన్ 
నీరాకకు - నిదురించక - నిశి నుంటిని గనరా 
చేరంగను - సిరి లబ్ధము - చిరకాలపు కలరా 

శ్రీరాగము - సిరివెన్నెల - సిరియందును నిశిలో 
స్త్రీరాగము - చెలి డెందము - సిరి నీకగుఁ ద్రుటిలో 
హారమ్మును - హరుసమ్మున - హరి వేతును మెడలో 
రారా సక - రమణీయము - రసపూరిత ఘడియల్ 

విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు
#
sirivennela - 

aadhAramu - kalpitamu, tiruj~nAna saMbaMdar vrAsina okapadyamu (uNNAmulaiyumaiyALoDu - 
# https://www.youtube.com/watch?v=YzDB3owmZRM #) deeniki mUlamu. 

sirivennela - ta/na/bha/sa/na/laga #UUII IIUII IIUII IIU#
17 atyashTi 63421

ninnEgada - ne~ra nammiti - nikhilammuna nepuDun 
nannElako - nagumOmuna - nayamai kana vipuDun 
vennuMDani - vinutiMtunu - vinarA karivaradA 
chennAra@Mga - cheli mOmuna@M - ji~rumuddula niDarA 

nInAmamu - nijamai yoka - nidhigA@M dala@MchitirA 
nInATyamu - niSiyaMduna - nelabAluni kalarA 
nInAdamu - ni~rupEdaku - nelavichchina smRtirA 
kAnaMganu - gaDu puNyamu - kamalAnana darirA 

vArammulu - varusammulu - varamul ninu daluvan 
bhArammagu - bahu vEdana - varamul ninu galuvan 
nIrAkaku - niduriMchaka - niSi nuMTini ganarA 
chEraMganu - siri labdhamu - chirakAlapu kalarA 

SrIrAgamu - sirivennela - siriyaMdunu niSilO 
strIrAgamu - cheli DeMdamu - siri nIkagu@M druTilO 
hArammunu - harusammuna - hari VEtunu meDalO 
rArA saka - ramaNIyamu - rasapUrita ghaDiyal 

vidhEyuDu - jejJAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: