[racchabanda] "ఉపజాతి" కందములు #"upajAti" kaMdamulu#

 

"ఉపజాతి" కందములు - 

రెండు విభిన్నమైన పాదములతో మనకు 16 విధములైన అమరికలు లభిస్తాయి. కందములోని కుఱుచ, నిడుద పాదములకు కూడ ఇది వర్తిస్తుంది. అందులోని ఆఱింటిని నిన్న మీకు వివరించినాను. ఈ ఆఱింటి విశేషము ఏమనగా - వాటిలో ఎప్పుడు రెండు కుఱుచ, రెండు నిడుద పాదములు ఉంటాయి. మూడు కు(ఱుచ) లేక ని(డుద) పాదములతో ఎనిమిది అమరికలు మనకు లభ్యము. అవి - 

కు/ని/ని/ని
ని/కు/ని/ని
ని/ని/కు/ని
ని/ని/ని/కు

ని/కు/కు/కు
కు/ని/కు/కు
కు/కు/ని/కు
కు/కు/కు/ని 

సంస్కృతములో ఉపజాతులను ఇలాగే సృష్టిస్తారు. కావున నిన్న చెప్పినవి, ఇప్పుడు చెప్పబోయేవి ఈ ఉపజాతి వర్గమునకు చెందినవే. జాతిపద్యమైన కందముతో "ఉపజాతి" పద్యాలు! 

కు/ని/ని/ని -
ఛందమ్ముల నందమ్మగు 
కందమ్ములు నిక్కముగను - గడు యందముగాఁ 
జిందిడు సోనలుగఁ దేనెఁ - జిత్తము  దనియన్ 
విందులె యవి కర్ణములకుఁ - బ్రియరాగములే 

ని/కు/ని/ని -
ఎల్లరి హృదయమ్ములందు - నేమియు గలవో 
తెల్లఁగ నెఱుంగు ననెదరు 
మల్లురఁ బడగొట్టు వాఁడు - మధురాధిపుఁ డీ
యుల్లమ్ము నెఱుంగడేల - యోప్రియసఖియా 

ని/ని/కు/ని -  
ఏమని పాడంగ నౌను - హృదయము పొంగెన్ 
భామినిఁ జూడంగ నాకుఁ - బదములు కరువై 
క్షామమువలె నయ్యెనుగా 
నామనసున వర్ష మెపుడు - నయముగఁ గురియున్ 

ని/ని/ని/కు - 
మదనుని పితతోడ నేను - మాటాడితి స-
మ్ముద మొసఁగెను వాఁడు నాకు - ముద్దులతోడన్ 
వదనమ్మును దాఁకఁఁబోవ - వాఁడు కనబడం 
డిది కలయా కల సుఖమే

ని/కు/కు/కు - 
వెన్నుని పదములను గొలువ - విరులను వెతకన్ 
గన్నుల కెటఁ గనబడవే 
చెన్నుగ నాహృది నలరెడు 
వన్నెల విరి చాలు గదా

కు/ని/కు/కు - 
కువలయనేత్రను గలఁ గన 
గు-వలయమునఁ జిక్కికొంటి - గొప్పగ నేనున్ 
గువలయమున వెతకి వెతకి 
కువలయమైతిని బ్రొద్దున్ 

కు/కు/ని/కు - 
చంద్రముఖీ ప్రాణసఖీ 
మంద్రరవపు మాధురితో 
సంద్రపు సైకతముపైని - జలలతవలె రా 
సాంద్రపరాగపు సంధ్యన్ 

కు/కు/కు/ని - 
సుందరతర మీసంధ్యయు 
వందల పక్షుల సడులన్ 
మందిరమున బలు గంటలు 
ముందుండెద ననిన నీవు - మ్రోలను లేవే

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
"upajAti" kaMdamulu - 

reMDu vibhinnamaina pAdamulatO manaku 16 vidhamulaina amarikalu labhistAyi. kaMdamulOni ku~rucha, niDuda pAdamulaku kUDa idi vartistuMdi. aMdulOni aa~riMTini ninna mIku vivariMchinAnu. ee aa~riMTi viSEshamu EmanagA - vATilO eppuDu reMDu ku~rucha, reMDu niDuda pAdamulu uMTAyi. mUDu ku(~rucha) lEka ni(Duda) pAdamulatO enimidi amarikalu manaku labhyamu. avi - 

ku/ni/ni/ni
ni/ku/ni/ni
ni/ni/ku/ni
ni/ni/ni/ku

ni/ku/ku/ku
ku/ni/ku/ku
ku/ku/ni/ku
ku/ku/ku/ni 

saMskRtamulO upajAtulanu ilAgE sRshTistAru. kAvuna ninna cheppinavi, ippuDu cheppabOyEvi ee upajAti vargamunaku cheMdinavE. jAtipadyamaina kaMdamutO "upajAti" padyAlu! 

ku/ni/ni/ni -
ChaMdammula naMdammagu 
kaMdammulu nikkamuganu - gaDu yaMdamugA@M 
jiMdiDu sOnaluga@M dEne@M - jittamu  daniyan 
viMdule yavi karNamulaku@M - briyarAgamulE 

ni/ku/ni/ni -
ellari hRdayammulaMdu - nEmiyu galavO 
tella@Mga ne~ruMgu nanedaru 
mallura@M baDagoTTu vA@MDu - madhurAdhipu@M DI
yullammu ne~ruMgaDEla - yOpriyasakhiyA 

ni/ni/ku/ni -  
Emani pADaMga naunu - hRdayamu poMgen 
bhAmini@M jUDaMga nAku@M - badamulu karuvai 
xAmamuvale nayyenugA 
nAmanasuna varsha mepuDu - nayamuga@M guriyun 

ni/ni/ni/ku - 
madanuni pitatODa nEnu - mATADiti sa-
mmuda mosa@Mgenu vA@MDu nAku - muddulatODan 
vadanammunu dA@Mka@M@MbOva - vA@MDu kanabaDaM 
Didi kalayA kala sukhamE

ni/ku/ku/ku - 
vennuni padamulanu goluva - virulanu vetakan 
gannula keTa@M ganabaDavE 
chennuga nAhRdi nalareDu 
vannela viri chAlu gadA

ku/ni/ku/ku - 
kuvalayanEtranu gala@M gana 
gu-valayamuna@M jikkikoMTi - goppaga nEnun 
guvalayamuna vetaki vetaki 
kuvalayamaitini broddun 

ku/ku/ni/ku - 
chaMdramukhI prANasakhI 
maMdraravapu mAdhuritO 
saMdrapu saikatamupaini - jalalatavale rA 
sAMdraparAgapu saMdhyan 

ku/ku/ku/ni - 
suMdaratara mIsamdhyayu 
vaMdala paxula saDulan 
maMdiramuna balu gaMTalu 
muMduMDeda nanina nIvu - mrOlanu lEvE

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: