[racchabanda] వైతాళీయ అర్ధసమ వృత్తము అరుంతుదము #vaitALIya ardhasama vRttamu aruMtudamu#

 

వైతాళీయ అర్ధసమ వృత్తము అరుంతుదము - 

ఆధారము - వాగ్వల్లభ

   IIUII - UIUIU స/స/జ/గ - బేసి పాదములు  
II IIUII - UIUIU న/జ/జ/ర - సరి పాదములు 

విన వచ్చునొ - ప్రేమగీతమున్ 
విని నను మెచ్చునొ - ప్రీతితో సకీ 
మనమందున - మాయ దెప్పుడున్ 
జిన చిన యాశల - శ్రీల రాశులున్ 

అరుతుందుఁడు - హాని చేయునో 
బిరబిర సాఁగితి - విహ్వలుండనై 
వరదా యన - వచ్చు నెప్పుడున్ 
కరివరదుం డొక - కామధేనువే 

రెండు పదములను చేర్చి చదివినప్పుడు వచ్చు లయతో - 

రవముల్ విన - రాత్రివేళలో // కల
రవమై మది - రంజిలెన్ గదా 
కవితా నను - కౌగిలించుకో // నవ 
దివమున్ గని - తేలిపోదు నేన్ 

నదిలో నొక - నావలోఁ జనన్ // సడి 
యెదలోపల - నెల్గుఁ దాల్చెనే 
యెది యెక్కడి - కీ ప్రయాణముల్ // జల 
నిధిఁ జేరుట - కెంత కాలమో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vaitALIya ardhasama vRttamu aruMtudamu - 

aadhAramu - vAgvallabha

#   IIUII - UIUIU# sa/sa/ja/ga - bEsi pAdamulu  
#II IIUII - UIUIU# na/ja/ja/ra - sari pAdamulu 

vina vachchuno - prEmagItamun 
vini nanu mechchuno - prItitO sakI 
manamaMduna - mAya deppuDun 
jina china yASala - SrIla rASulun 

arutuMdu@MDu - hAni chEyunO 
birabira sA@Mgiti - vihvaluMDanai 
varadA yana - vachchu neppuDun 
karivaraduM Doka - kAmadhEnuvE 

reMDu padamulanu chErchi chadivinappuDu vachchu layatO - 

ravamul vina - rAtrivELalO // kala
ravamai madi - raMjilen gadA 
kavitA nanu - kaugiliMchukO // nava 
divamun gani - tElipOdu nEn 

nadilO noka - nAvalO@M janan // saDi 
yedalOpala - nelgu@M dAlchenae 
yedi yekkaDi - kI prayANamul // jala 
nidhi@M jEruTa - keMta kAlamO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: