[racchabanda] వైతాళీయ-ప్రాచ్యవృత్యపరాంతికా #vaitALIya-prAchyavRtyaparAMtikA#

 

వైతాళీయ-ప్రాచ్యవృత్యపరాంతికా - 

ఇందులో అన్ని పాదములలో మొదటి ఎనిమిది మాత్రలు ప్రాచ్యవృత్తియందలి సరి పాదములవలె నుంటుంది, అనగా 3+గురువు+3 మాత్రలు. ఇవి నాలుగు విధములని హేమచంద్రుని ఛందోఽనుశాసనములో పేర్కొనబడినది- UIUIU, IIIUIU, UIUIII, IIIUIII. క్రింద నా ఉదాహరణములు - 

వైతాళీయ-ప్రాచ్యవృత్యపరాంతికా - 3+U+3 + ర/లగ 

మానసమ్ములో - మౌనరాగమా 
గానవాహినియు - గట్టిపాఱెనా 
వేణురావములు - వీఁగిపోయెనా 
మేనితోడ నిఁక - మేను చేరదా 

తెల్లనైన శశి - తేలె నింగిలో 
నుల్లమందుఁ జిఱు - యూహలెన్నియో 
మెల్లమెల్లఁగా - మేను పొంగఁగా 
నల్లుకొమ్ము నను - హర్షమియ్యఁగా 

కవిత వ్రాయు నీ - కన్నులందు నే 
భువన మొండు గని - పుల్కరించితిన్ 
నవనవమ్ముగా - నాట్యమాడ రా 
భవనమందు దివె - భాసిలున్ గదా 

విధేయుదు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vaitALIya-prAchyavRtyaparAMtikA - 

iMdulO anni pAdamulalO modaTi enimidi mAtralu prAchyavRttiyaMdali sari pAdamulavale nuMTuMdi, anagA 3+guruvu+3 mAtralu. ivi nAlugu vidhamulani hEmachaMdruni ChaMdO@2nuSAsanamulO pErkonabaDinadi- #UIUIU, IIIUIU, UIUIII, IIIUIII#. kriMda nA udAharaNamulu - 

vaitALIya-prAchyavRtyaparAMtikA - 3+#U#+3 + ra/laga 

mAnasammulO - maunarAgamA 
gAnavAhiniyu - gaTTipA~renA 
vENurAvamulu - vI@MgipOyenA 
mEnitODa ni@Mka - mEnu chEradA 

tellanaina SaSi - tEle niMgilO 
nullamaMdu@M ji~ru - yUhalenniyO 
mellamella@MgA - mEnu poMga@MgA 
nallukommu nanu - harshamiyya@MgA 

kavita vrAyu nI - kannulaMdu nE 
bhuvana moMDu gani - pulkariMchitin 
navanavammugA - nATyamADa rA 
bhavanamaMdu dive - bhAsilun gadA 

vidhEyudu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: