[racchabanda] వైతాళీయపు సరి పాదములతో అపరాంతికా#vaitALIyapu sari pAdamulatO aparAMtikA#

 

వైతాళీయపు సరి పాదములతో అపరాంతికా - 

వైతాళీయపు సరి పాదముల అమరిక - 8 మాత్రలు + ర/లగ; ఎనిమిది మాత్రలలో నాలుగుకన్న లఘువులు పక్కపక్కన ఉండరాదు. ఎదురు నడక నిషిద్ధము. ఈ వైతాళీయ-అపరాంతిక నిజముగా మాలతీ వృత్తపు వర్గమునకు చెందినది. దీనినిగుఱించి నేను "అష్టమాత్రా వృత్తములు" అని ఒక వ్యాసమును "ఈమాట"లో వ్రాసియున్నాను. మాలతీ వృత్తపు అమరిక - న/జ/జ/ర - IIII UII - UIUIU. ప్రథమార్ధములో రెండు చతుర్మాత్రలు, ద్వితీయార్ధములో రెండు చతుర్మాత్రలు కాని ఒక అష్టమాత్ర. ఈ అపరాంతికకు కూడ ద్వితీయార్ధములో ర/లగ, ప్రథమార్ధములో రెండు చతుర్మాత్రలు. క్రింద నా ఉదాహరణములు - 

అపరాంతికా (వైతాళీయము) - 8 మాత్రలు + ర/లగ

నీ నవ్వులలో - నిండెఁ బువ్వులే 
నీ నాట్య మ్మది - నేత్ర పర్వమే 
గాన మ్మన్నది - గంగ యయ్యె నా
యానంద మ్మొక - యర్ణవమ్ముగా 

అహ యా కేతువు - హర్షమొందఁగా 
గ్రహణము నేఁడా-కాశ వీథిలో 
జుహువానమువలెఁ - జూడ నెఱ్ఱఁగా 
రహి నాడెను మది - రమ్య రీతులన్ 

నను జూడఁగ రా - నందనందనా 
విను నా గాథను - బ్రేమమందిరా 
ప్రణయ మ్మన్నది - బంధకావ్యమా 
మన చిత్రములే - మాదిరుల్ సుమా 

సాయంకాలపు - చల్లగాలిలో 
నాయాశల విరి - నాయెడందలోఁ 
బూయం దొడఁగెను - ముద్దు ముగ్ధగా 
మోయన్ లేనీ - మోద భారమున్

మాలతి వృత్తముగా -
అరుణపు ఛాయల - నర్ధ చంద్రుఁ డా-
వరణము చేసెనె - యాకసమ్ములోఁ 
దరుణము మించిన - తారకావిభున్ 
గనఁగ నసాధ్యము - గ్రాసవేళలో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vaitALIyapu sari pAdamulatO aparAMtikA - 

vaitALIyapu sari pAdamula amarika - 8 mAtralu + ra/laga; enimidi mAtralalO nAlugukanna laghuvulu pakkapakkana uMDarAdu. eduru naDaka nishiddhamu. ee vaitALIya-aparAMtika nijamugA mAlatI vRttapu vargamunaku cheMdinadi. dIninigu~riMchi nEnu "ashTamAtrA vRttamulu" ani oka vyAsamunu "eemATa"lO vrAsiyunnAnu. mAlatI vRttapu amarika - na/ja/ja/ra - #IIII UII - UIUIU#. prathamArdhamulO reMDu chaturmAtralu, dvitIyArdhamulO reMDu chaturmAtralu kAni oka ashTamAtra. ee aparAMtikaku kUDa dvitIyArdhamulO ra/laga, prathamArdhamulO reMDu chaturmAtralu. kriMda nA udaaharaNamulu - 

aparAMtikA (vaitALIyamu) - 8 mAtralu + ra/laga

nI navvulalO - niMDe@M buvvulE 
nI nATya mmadi - nEtra parvamE 
gAna mmannadi - gaMga yayye nA
yaanaMda mmoka - yarNavammugA 

aha yA kEtuvu - harshamoMda@MgA 
grahaNamu nE@MDA-kASa vIthilO 
juhuvAnamuvale@M - jUDa ne~r~ra@MgA 
rahi nADenu madi - ramya rItulan 

nanu jUDa@Mga rA - naMdanaMdanA 
vinu nA gAthanu - brEmamaMdirA 
praNaya mmannadi - baMdhakAvyamA 
mana chitramulE - mAdirul sumA 

sAyaMkAlapu - challagAlilO 
nAyASala viri - nAyeDaMdalO@M 
bUyaM doDa@Mgenu - muddu mugdhagA 
mOyan lEnI - mOda bhAramun

mAlati vRttamugA -
aruNapu ChAyala - nardha chaMdru@M DA-
varaNamu chEsene - yAkasammulO@M 
daruNamu miMchina - tArakAvibhun 
gana@Mga nasAdhyamu - grAsavELalO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: